Yadagiri Gutta : యాదాద్రిలో నిత్య పూజలు, దర్శన వివరాలు

యాదాద్రిలో నిత్య పూజలు, దర్శన వివరాలను ఈవో కార్యాలయం వెల్లడించింది. ఈ నెల 29వ తేదీ నుంచి అవి అమలు కానున్నట్లు ఈవో కార్యాలయం తెలిపింది...

Yadagiri Gutta : యాదాద్రిలో నిత్య పూజలు, దర్శన వివరాలు

Yadadri

Yadadri Temple Timings : ఎప్పుడెప్పుడా అని భక్తులు ఎదురుచూస్తున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం పునఃప్రారంభానికి అకురార్పణ జరిగింది. బాలాలయంలో పంచకుండాత్మక మహాయజ్ఞం ప్రారంభించారు. విశ్వశాంతి, లోక కల్యాణం కోసం యాగం నిర్వహిస్తున్నారు రుత్వికులు. వివిధ క్షేత్రాల నుంచి వచ్చిన వేదపండితులు యాగం చేస్తున్నారు. యాగానికి భక్తులను అనుమతిస్తున్నారు. ఈనెల 28 వరకు ఇది కొనసాగనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యాదాద్రి ఆలయాన్ని పునర్ నిర్మించిన సంగతి తెలిసిందే. యాదాద్రిలో నిత్య పూజలు, దర్శన వివరాలను ఈవో కార్యాలయం వెల్లడించింది. ఈ నెల 29వ తేదీ నుంచి అవి అమలు కానున్నట్లు ఈవో కార్యాలయం తెలిపింది. ప్రతి రోజు తెల్లవారుజామున 3 గంటలకు ఆలయాన్ని తెరుస్తారు. అనంతరం స్వామి వారికి సుప్రభాత సేవ జరుగనుంది.

Read More : Yadadri Break Darshans : యాదాద్రిలో కూడా తిరుమల మాదిరిగా బ్రేక్‌ దర్శనాలు, ఆన్‌లైన్‌ దర్శనాలు

తెల్లవారుజామున 3.30 గంటలకు బిందెతీర్థం, ఆరాధన చేయనున్నారు ఆలయ అర్చుకులు.
ఉదయం 4.00 గంటలకు బాలభోగం. ఇది అరగంట పాటు కొనసాగనుంది.
ఉదయం 4.30 గంటకు స్వామి వారికి నిజాభిషేకం చేస్తారు.
ఉదయం 5.30 గంటలకు స్వామి వారిని అలంకరిస్తారు.
ఉదయం 5.45 గంటలకు సహస్రనామార్చన, కుంకుమార్చలను నిర్వహిస్తారు.
ఉదయం 6.30 గంటలకు భక్తులకు స్వామి వారి దర్శనాన్ని కల్పిస్తారు.

Read MoreYadadri Temple : యాదాద్రి ఆలయం పునః ప్రారంభానికి అంకురార్పణ

ఉదయం 8.00 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తారు.
ఉదయం 9.00 గంటలకు సర్వదర్శనం.
మధ్యాహ్నం 12.00 గంటలకు రాజభోగం అంటే ఆరగింపు చేస్తారు. ఈ సమయంలో భక్తులను అనుమతించరు.
మధ్యాహ్నం 12.45 గంటలకు సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు.
సాయంత్రం 4.00 గంటలకు మరోసారి వీఐపీ బ్రేక్ దర్శనాన్ని అమలు చేస్తారు.

Read More : Yadadri : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి స్వయంభువుల దర్శనం

సాయంత్రం 5.00 గంటలకు సర్వదర్శనం.
రాత్రి 7 గంటలకు తిరు ఆరాధనను ఆలయ అర్చకులు నిర్వహిస్తారు.
రాత్రి 7.30 గంటలకు సహస్రనామార్చన, కుంకుమార్చనలను మరోసారి నిర్వహిస్తారు.
రాత్రి 8.15 గంటలకు సర్వదర్శనం.
రాత్రి 9.15 గంటలకు రాత్రి నివేదన అంటే ఆరగింపు చేస్తారు.
రాత్రి 9.45 గంటలకు శయనోత్సవం, ద్వారబంధనం చేస్తారు. ఈ సమయంలో భక్తులను అనుమతించరు.

Read More : Yadadri Temple : యాదాద్రిలో శ్రీసుదర్శన నారసింహ మహాయాగం వాయిదా

ఇక ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 9.15 గంటల మధ్య దర్శన వేళల్లో సువర్ణ పుప్పార్చన/ వేదాశీర్వచనం చేస్తారు.
ఉదయం 8.30 గంటల నుంచి 10 గంటల వరకు సుదర్శన హోమం ఉంటుంది.
ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ స్వామి వారి నిత్య కళ్యాణం/బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు.
సాయంత్రం 5 గంటలకు వెండి మొక్కు జోడు సేవలు ఉంటాయి.
సాయంత్రం 6.45 గంటలకు దర్బార్ సేవ ఉంటుంది.
ప్రతి మంగళవారం ఉదయం 8.30 గంటలకు ఆంజనేయస్వామి వారికి ఆకుపూజ ఉండనుంది.
ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు అమ్మవారికి ఉత్సవ సేవ నిర్వహిస్తారు.