Yadadri Temple : యాదాద్రిలో శ్రీసుదర్శన నారసింహ మహాయాగం వాయిదా

యాదాద్రిలో మహా యాగం వాయిదా పడింది. యాదాద్రి మహాక్షేత్రంలో శ్రీ సుదర్శన నారసింహ మాహాయాగాన్ని వాయిదా వేస్తున్నట్లు.. యాడా వైస్ ఛైర్మన్ కిషన్‌రావు తెలిపారు.

Yadadri Temple : యాదాద్రిలో శ్రీసుదర్శన నారసింహ మహాయాగం వాయిదా

Telangana Yadadri

Yadadri Temple : యాదాద్రిలో మహా యాగం వాయిదా పడింది. యాదాద్రి మహాక్షేత్రంలో మార్చి 21 నుంచి నిర్వహించాలనుకున్న శ్రీ సుదర్శన నారసింహ మాహాయాగాన్ని వాయిదా వేస్తున్నట్లు.. యాడా వైస్ ఛైర్మన్ కిషన్‌రావు తెలిపారు. పునర్‌ నిర్మితమైన పంచ నారసింహుల దివ్యాలయ మహాకుంభ సంప్రోక్షణ వేడుకలో భాగంగా వచ్చే నెల 21 నుంచి నిర్వహించాలనుకున్న శ్రీసుదర్శన నారసింహ మహాయాగం వాయిదా వేశారు. క్షేత్రాభివృద్ధిలో భాగంగా చేపట్టిన కట్టడాలు పూర్తికాకపోవడం.. యాగం ఏర్పాట్లు కూడా పూర్తికాకపోవడంతోనే యాగాన్ని వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. ఆలయ ఉద్ఘాటన తరువాత యాగం నిర్వహించే అవకాశం ఉందన్నారు కిషన్‌రావు. మూలమూర్తుల దర్శనం మాత్రం గతంలో నిశ్చయించినట్టుగా మార్చి 28 నుంచే ఉంటుంది. యాగం నిర్వహణకు మరో ముహూర్తం ఖరారు చేస్తున్న యాదాద్రి ఆలయ అర్చకులు.. మేలో సుదర్శన మహాయాగాన్ని నిర్వహించే అవకాశం ఉంది.

Also read : తెలుగు రాష్ట్రాలకు కిక్కిచ్చే ఆదాయం 

క్షేత్రాభివృద్ధిలో భాగంగా చేపట్టిన కట్టడాలు పూర్తికానందునే యాగాన్ని వాయిదా వేశామని అన్నారు. ఆలయ ఉద్ఘాటన తరువాత యాగం నిర్వహించే అవకాశం ఉందని వెల్లడించారు. ఫలితంగా యాగం నిర్వహణకు మరో ముహూర్తం ఖరారు చేస్తామన్నారు. మూలవరుల దర్శనం మాత్రం గతంలో నిశ్చయించినట్టుగా మార్చి 28 నుంచే ఉంటుందని వివరించారు. ప్రస్తుతం పంచనారసింహుల ప్రతిష్ఠామూర్తుల దర్శనాలు, భక్తుల ఆర్జిత సేవలు సాగుతున్న బాలాలయాన్ని మార్చి 27 వరకు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Also read : Road Accident : మేడారం జాతరకు వెళ్లొస్తుండగా విషాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని నలుగురు మృతి

యాదాద్రి దివ్యక్షేత్రం మహాకుంభ సంప్రోక్షణకు ముస్తాబవుతోంది. పునర్నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. కృష్ణ శిలలతో లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. భక్తులకు మరపురాని మధురానుభూతి పంచేలా యాదాద్రిని తీర్చిదిద్దుతున్నారు. స్వయంభువుల దర్శనాలకు ఇంకా తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉండడంతో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

Also read : Tirumala : శ్రీవారి లడ్డూలో అనంత ‘పప్పుశనగ’.. రైతుల ఆనందం

ఎంతో మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో కొండపై లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు శివాలయాన్ని పునర్నిర్మించారు. పరిసరాల్లోనే విష్ణు పుష్కరిణి, ప్రసాదాల తయారీ, విక్రయ సముదాయం, క్యూ కాంప్లెక్స్‌ కడుతున్నారు. బ్రహ్మోత్సవ మండపం నిర్మించారు. కొండపై ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా ఏర్పాట్లు చేశారు. కొండ చుట్టూ పచ్చని మొక్కలు నాటి ఆహ్లాదకరంగా రూపొందిస్తున్నారు.