Mahesh Babu: మరో బిజినెస్ స్టార్ట్ చేస్తున్న మహేష్..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ రంగంలో అడుగుపెట్టినా ఆయన అక్కడ సూపర్ సక్సెస్ అవుతున్నాడు. ఇప్పటికే ఏషియన్ సంస్థతో కలిసి ఏఎంబీ సినిమాస్ అనే థియేటర్ చైన్‌ను ప్రారంభించాడు మహేష్. ఇక ఇప్పుడు మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు మహేష్ రెడీ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Mahesh Babu: మరో బిజినెస్ స్టార్ట్ చేస్తున్న మహేష్..?

Mahesh Babu To Venture Into Restaurant Business

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ రంగంలో అడుగుపెట్టినా ఆయన అక్కడ సూపర్ సక్సెస్ అవుతున్నాడు. ఇటు సినిమాల్లో టాలీవుడ్‌లోనే నెంబర్ వన్ స్థానంలో నిలిస్తూ మిగతా హీరోలకు అందనంత ఎత్తుకు ఎదిగిపోతూనే, అటు వ్యాపార రంగంలోనూ తనదైన మార్క్ వేసుకుంటున్నాడు. ఇప్పటికే ఏషియన్ సంస్థతో కలిసి ఏఎంబీ సినిమాస్ అనే థియేటర్ చైన్‌ను ప్రారంభించాడు మహేష్. ఇక ఇప్పుడు మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు మహేష్ రెడీ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Mahesh Babu: మహేష్ డబుల్ ట్రీట్.. తూచ్ అంట!

ఇండస్ట్రీలోని చాలా మంది హీరోలు చేస్తున్న వ్యాపారమే అయినా, తన ప్రత్యేకతను చాటుకునేలా రెస్టారెంట్ బిజినెస్‌లో దూసుకుపోయేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు. ఈ రంగంలో అగ్రగామిగా పేరుగాంచిన మినర్వా గ్రూప్‌తో చేతులు కలిపేందుకు మహేష్ రెడీ అవుతున్నాడట. ఈ సంస్థతో భాగస్వామ్యం అయ్యి తనదైన మార్కెట్ స్ట్రాటెజీతో పలు మెట్రో నగరాల్లో ఈ రెస్టారెంట్లు తెరిచేందుకు సిద్ధమవుతున్నాడట.

Mahesh Babu: పుట్టినరోజునే ముహూర్తం పెట్టిన మహేష్..?

త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా మహేష్ బాబు చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇప్పటికే మల్టీప్లెక్స్ బిజినెస్‌లో సక్సెస్ అందుకున్న మహేష్, ఇప్పుడు రెస్టారెంట్ బిజినెస్‌ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడో చూడాలి. ఇక సినిమాల విషయానికి వస్తే.. తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు ఈ సూపర్ స్టార్.