Delhi Tain: రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు.. తప్పిన పెను ప్రమాదం

యూపీలోని గయ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన రెండు బోగీలు ఇంజిన్ నుంచి విడిపోయాయి. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి హానీ కలగలేదని అధికారులు తెలిపారు.

Delhi Tain: రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు.. తప్పిన పెను ప్రమాదం

Delhi Tain: ఢిల్లీ పరిధిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం ఒక రైలు బోగి, రైలు నుంచి విడిపోయింది. అయితే, ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని గయ నుంచి ఢిల్లీ వెళ్తున్న మహాబోధి ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన రెండు బోగీలు ఇంజిన్ నుంచి విడిపోయాయి.

India vs Bangladesh: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. తొలి వికెట్ కోల్పోయిన ఇండియా

కర్వాందియా-సాసారామ్ రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ సమయంలో రైలులో 1,300 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. రైలు వేగంగా ప్రయాణిస్తుండగా 8,9వ నెంబర్ బోగీలు ఇంజిన్ నుంచి విడిపోయాయి. అయితే, విడిపోయిన బోగీలు పట్టాల మధ్యలోనే ఉండటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనలో ఎవరికీ, ఎలాంటి హానీ కలగలేదని అధికారులు తెలిపారు. సాధారణంగా రైలు నుంచి విడిపోయిన బోగీలు పట్టాలు తప్పే అవకాశం ఉంటుంది. కానీ, ఈ ఘటనలో అలాంటిది జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు అంటున్నారు. ఘటన గురించి తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే స్పందించారు.

ప్రమాద స్థలానికి చేరుకుని, రైలు బోగీలను తిరిగి కలిపారు. 40 నిమిషాల తర్వాత రైలు తిరిగి బయలుదేరింది. కాగా, ఈ ఘటనపై విచారణ జరిపి, దీనికిగల కారణాలు తెలుసుకుంటామని రైల్వే అధికారులు చెప్పారు.