Telangana : టి.సర్కార్‌‌పై కాంగ్రెస్ నేతల మండిపాటు, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్కలు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. 2021, జూన్ 13వ తేదీ ఆదివారం సీఎల్పీ అత్యవసర సమావేశం జూమ్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చర్యలపై నేతలు విమర్శలు గుప్పించారు.

Telangana : టి.సర్కార్‌‌పై కాంగ్రెస్ నేతల మండిపాటు, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే

T.congress

Telangana Government : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్కలు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. 2021, జూన్ 13వ తేదీ ఆదివారం సీఎల్పీ అత్యవసర సమావేశం జూమ్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చర్యలపై నేతలు విమర్శలు గుప్పించారు.

ఎమ్మెల్యే జగ్గారెడ్డి : –
కరోనా థర్డ్ వేవ్ పై ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని, ఇప్పటికే సెకండ్ వేవ్ కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. థర్డ్ వేవ్ పై WHO అలర్ట్ చేసిందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆక్సిజన్ లేక చాలా మంది చనిపోయారని, ముందస్తు ప్రణాళిక లేకుంటే చాలా మంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందన్నారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్, బెడ్లు, సిటీ స్కాన్ లాంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి సౌకర్యాలు కల్పిస్తే..పేద ప్రజలు ప్రైవేటు ఆసుపత్రుల వైపు వెళ్లరని వెల్లడించారు.

రోగి చనిపోయిన తర్వాత..కూడా వారి కుటుంబసభ్యుల నుంచి డబ్బులు దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారమే..ఫీజులు వసూలు చేయాలని, అధిక పీజులు వసూలు చేయవద్దని ఈ సందర్భంగా ప్రైవేటు ఆసుపత్రులకు ఆయన సూచించారు. ఈ ఆసుపత్రులపై ప్రభుత్వం డేగా కన్ను పెట్టాలని, ప్రధానంగా అపోలో, యశోదా, కిమ్స్ లాంటి హాస్పిటల్స్ పై దృష్టి పెట్టాలన్నారు. కాంగ్రెస్ చీఫ్ ఎంపికపై ఆయన స్పందించారు. పీసీసీ నియామకంపై ఇంకా సమయం ఉందని, ఢిల్లీలో ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. తనకు పీసీసీ పదవి ఇవ్వాలని సోనియా, రాహుల్ కు లేఖ రాసినట్లు, పీసీసీ లేకుంటే..వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అయితే..అధిష్టానం ఎవరికి పదవి కట్టబెట్టినా..కలిసి కట్టుగా పనిచేస్తామన్నారు.

మల్లు భట్టి విక్రమార్క: –
రాష్ట్ర ప్రభుత్వం విలువైన భూములను అమ్మి పెద్ద ఎత్తున సొమ్ము రాబట్టాలనే ప్రభుత్వ ఆలోచనను ఖండిస్తున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పటికే చేసిన అప్పులతో ప్రజలపై మోయలేని భారం పడిందని, కార్పొరేషన్ ల ద్వారా 1.05 లక్షల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నేరుగా 2.86 లక్షల కోట్లు అప్పు చేసిందని ఆరోపించారు. మొత్తంగా ఇప్పటికే 3.86 లక్షల కోట్లు అప్పు చేసిందని, 2023-24 వరకు రాష్ట్ర ప్రభుత్వం అప్పులతో దివాళా తీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

భూముల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజల ముందు పెట్టాలని, భూముల అమ్మకాన్ని నిలిపివేయకపోతే…కాంగ్రెస్ అడ్డుకుని తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. మొండిగా కొంటే..కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత..వాటిని రద్దు చేస్తుందన్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని, గతంలో భూముల అమ్మకాన్ని టీఆర్ఎస్ వ్యతిరేకించిందని మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.

Read More : Black Fungus Injection : బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ బ్లాక్‌లో అమ్ముతున్న ముఠా అరెస్ట్