Black Fungus Injection : బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ బ్లాక్‌లో అమ్ముతున్న ముఠా అరెస్ట్
బ్లాక్ ఫంగస్ వ్యాధి రోగులకు ఇచ్చే ఇంజక్షన్‌ను అధిక ధరలకు విక్రయిస్తున్నముఠాను హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Five Held For Selling Anti Black Fungal Injection
Black Fungus Injection : బ్లాక్ ఫంగస్ వ్యాధి రోగులకు ఇచ్చే ఇంజక్షన్‌ను అధిక ధరలకు విక్రయిస్తున్నముఠాను హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో బ్లాక్ ఫంగస్ అంపోతెరిసియన్ ఇంజెక్షన్లను అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు.
ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి 9 అంపోతెరిసియన్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఒక్కో అంపోతెరిసియన్
ఇంజెక్షన్‌ను అధిక ధరకు రూ. 35 వేలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. తదుపరి విచారణ నిమిత్తం 5గురు నిందితులను ఎస్ ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు.