Mamata Banerjee: బెంగాల్‭లో అల్లర్లకు బిహార్ గూండాల్ని తెచ్చిన బీజేపీ.. మమత సంచలన ఆరోపణలు

బామ్ (లెఫ్ట్)' 'రామ్ (బీజేపీ)' మాకు వ్యతిరేకంగా చేతులు కలిపారు. నా క్యారెక్టర్‌ని దుర్మార్గంగా చూపేందుకు ప్లాన్ చేస్తున్నారు. కానీ వారికి నా గురించి తెలియదు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు నా వెంట ఉన్నారు. ‘ఖేలా హోబే’ నినాదంతో వారిని (బీజేపీ) అడ్డుకున్నారు. నేను ‘దీదీ, ఓ దీదీ’ లేదా ‘ఎబార్ 200 పార్ (ఈసారి 200 సీట్లకు పైగా)’ లాంటివి ఎలా మర్చిపోగలను?

Mamata Banerjee: బెంగాల్‭లో అల్లర్లకు బిహార్ గూండాల్ని తెచ్చిన బీజేపీ.. మమత సంచలన ఆరోపణలు

Mamata Banerjee

Updated On : April 4, 2023 / 7:06 PM IST

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హౌరా, హుగ్లీలో రామనవమి సందర్భంగా జరిగిన అల్లర్లకు కారణం భారతీయ జనతా పార్టీయేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. బెంగాల్‭లో అల్లర్లు సృష్టించేందుకు బిహార్ నుంచి గూండాలను తీసుకువచ్చారని కూడా ఆమె ఆరోపించారు. మంగళవారం రాష్ట్రంలోని తూర్పు మిడ్నాపూర్‌లోని ఖేజురీలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Asaduddin Owaisi: పశ్చిమ బెంగాల్, బిహార్ అల్లర్లు.. ఆ మాత్రం చాతకాదా అంటూ నితీశ్, మమతలపై మండిపడ్డ ఓవైసీ

“నేను ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలి. బీజేపీ ఎప్పుడు, ఎక్కడికి వెళ్లి అల్లర్లు సృష్టిస్తుందో తెలియదు. బెంగాల్ ప్రజలు అల్లర్లను ఇష్టపడరని ఈ వ్యక్తులకు (బీజేపీ నేతలకు) అర్థం కావడం లేదు. మేము అల్లర్లు చేయము. సామాన్య ప్రజలు అల్లర్లు చేయరు. బీజేపీ చేయలేకపోతే మరి ఎవరు చేశారు? అల్లర్లను రెచ్చగొట్టడానికి వారు గూండాలను నియమించుకుంటున్నారు. బీహార్ నుంచి పోకిరిలను తీసుకువస్తున్నారు. వారు బుల్డోజర్లు, ట్రాక్టర్లు, తుపాకులతో హౌరాలోకి ప్రవేశించి అనేక ఇళ్లను తగులబెట్టారు. అసలు ఆ యాత్రకు పోలీసుల అనుమతే లేదు. హౌరా తర్వాత రిష్రాకు వెళ్లారు” అని మమతా బెనర్జీ అన్నారు.

Bangladesh: బంగ్లా బట్టల బజార్‭లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో 3,000 దుకాణాలు

హింసను ప్రేరేపించే వారికి మతం లేదని మమతా బెనర్జీ అన్నారు. “ఇది ఎలాంటి మతం? అల్లర్లకు పాల్పడిన వారు హిందువులు కాదు, ముస్లింలు కాదు. వారు బీజేపీ గూండాలు మాత్రమే’’ అని ఆమె అన్నారు. పశ్చిమ బెంగాల్ అనేక హిందూ పండుగలను జరుపుకుంటుందని, గూండాయిజం ఎప్పుడూ జరగలేదని అన్నారు. “రామ నవమి సందర్భంగా హింసను నిర్వహించడం ద్వారా బీజేపీ రాముడి పేరును కించపరుస్తోంది. ఒక వర్గాన్ని మరో వర్గాన్ని ఇరకాటంలో పెట్టి హిందూ ధర్మ పరువు తీస్తున్నారు. బీహార్‌లో అధికారంలోకి వస్తే అల్లరిమూకలను తలకిందులుగా ఉరితీస్తామని అమిత్ షా అన్నారు. వారు తమ గూండాలను ఎందుకు అలా చేయడం లేదు?’’ ఆమె ప్రశ్నించారు.

KCR Targets AP : కేసీఆర్ టార్గెట్ ఏపీ.. బీఆర్ఎస్ విస్తరణకు ప్లాన్, విశాఖలో భారీ బహిరంగ సభ

తృణమూల్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీతో వామపక్షాలు కుమ్మక్కయ్యాయని మమత ఆరోపించారు. “’బామ్ (లెఫ్ట్)’ ‘రామ్ (బీజేపీ)’ మాకు వ్యతిరేకంగా చేతులు కలిపారు. నా క్యారెక్టర్‌ని దుర్మార్గంగా చూపేందుకు ప్లాన్ చేస్తున్నారు. కానీ వారికి నా గురించి తెలియదు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు నా వెంట ఉన్నారు. ‘ఖేలా హోబే’ నినాదంతో వారిని (బీజేపీ) అడ్డుకున్నారు. నేను ‘దీదీ, ఓ దీదీ’ లేదా ‘ఎబార్ 200 పార్ (ఈసారి 200 సీట్లకు పైగా)’ లాంటివి ఎలా మర్చిపోగలను? వారు ఓడిపోతామని తెలిసి నందిగ్రాములో రిగ్గింగ్ చేశారు. కౌంటింగ్ రోజు కరెంటు ఎందుకు లేదు?’’ అని మమత అన్నారు.