CM KCR Federal: సీఎంలు కేసీఆర్, స్టాలిన్‌తో మాట్లాడా, మేం కాపాడతాం: మమతా బెనర్జీ

ప్రగతి భవన్ వేదికగా ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం కేసీఆర్. దీంతో త్వరలో పెనుమార్పు జరుగుతుందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

CM KCR Federal: సీఎంలు కేసీఆర్, స్టాలిన్‌తో మాట్లాడా, మేం కాపాడతాం: మమతా బెనర్జీ

Tmc

CM KCR Federal: ప్రగతి భవన్ వేదికగా ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం కేసీఆర్. దీంతో త్వరలో పెనుమార్పు జరుగుతుందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటిని బలపరిచేదిశగా కామెంట్ చేశారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. దీంతో సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా కొత్త పార్టీ పెడతారా.. మూడు పార్టీల కూటమితో మరేదైనా జరుగుతుందా అనే సందేహాలు నెలకొన్నాయి.

ఈ సందర్భంగా మమతా బెనర్జీ కామెంట్లు సంచలనంగా మారాయి. తాను ఫోన్లో తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్ తో మాట్లాడానని దేశంలోని సమాఖ్యవాదాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు మమతా బెనర్జీ.

‘కాంగ్రెస్ తో ఏ ప్రాంతీయ పార్టీకి కూడా సత్సంబంధాలు లేవు. కాంగ్రెస్ పార్టీ దాని దారిలో వెళ్తుంది. మేం మా దారిలో వెళ్తాం. టీఎంసీ గ్రేట్ ఇంట్రస్ట్ తో యూపీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. మార్చి 3న వారణాసిలో ర్యాలీ నిర్వహిస్తా’ అని మమతా వెల్లడించారు.

Read Also: వేలం మొత్తంలో కొనుగోలు కాకుండా మిగిలిపోయిన ప్లేయర్లు

కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్ ప‌నితీరును ప్రగతి భవన్ వేదికగా ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఎండ‌గ‌ట్టారు కేసీఆర్.

”మోదీ ప్ర‌భుత్వానికి ద‌మ్ముంటే దేశాన్ని.. చైనాలా అభివృద్ధి చేయాల‌ని స‌వాల్ చేశారు. సాధార‌ణంగా 12 శాతం గ్రోత్ ఉంటే ఆరేళ్లలో దేశ ఎకాన‌మీ డ‌బుల్ అవుతుంది. 11 శాతం ఉంటే ఏడేళ్లలో డ‌బుల్ అవుతుంది. అది న‌రేంద్ర మోదీ, నిర్మ‌లా సీతారామ‌న్ చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఏ వ‌డ్డీ వ్యాపారిని అడిగినా చెబుతాడు. ఇది క‌ఠోర‌మైన వాస్త‌వం. 2025 వ‌ర‌కు 5 ట్రిలియ‌న్ ఎకాన‌మీకి తీసుకెళ్ల‌డానికి న‌రేంద్ర మోదీ అవ‌స‌రం లేదు. మీకు ద‌మ్ముంటే.. మీరు దేశాన్ని అభివృద్ధి చేయాల‌ని అనుకుంటే.. చైనాలా అభివృద్ధి చేయండి. సింగపూర్‌లా అభివృద్ధి చేయండి” అని కేసీఆర్ సవాల్ విసిరారు.