Mammootty : మలయాళం స్టార్ హీరో మమ్ముట్టికి కరోనా

మమ్ముట్టికి కరోనా సోకిందని తానే స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ''అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా నాకు కరోనా వచ్చింది. నాతో ఇటీవల సన్నిహితంగా తిరిగిన వారంతా........

Mammootty : మలయాళం స్టార్ హీరో మమ్ముట్టికి కరోనా

Mammootty

Mammootty :  ఇటీవల రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ సారి చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్, తమిళ్, తెలుగు స్టార్లు చాలా మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు మలయాళం స్టార్లు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి కరోనా బారిన పడ్డారు.

Evam Jagath : రూపాయికే సినిమా.. మంచి సినిమా కోసం కొత్త దర్శకుడి తాపత్రాయం..

మమ్ముట్టికి కరోనా సోకిందని తానే స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ”అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా నాకు కరోనా వచ్చింది. నాతో ఇటీవల సన్నిహితంగా తిరిగిన వారంతా కరోనా టెస్ట్ చేయించుకోండి. ప్రస్తుతం నాకు తేలికపాటి జ్వరం మాత్రమే ఉంది. నేను బాగానే ఉన్నాను. డాక్టర్ల పర్యవేక్షణలో వారి సూచనలతో ఇంట్లోనే ఐసొలేట్ అయి వారు చెప్పిన మెడిసిన్ తీసుకుంటూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడూ మాస్క్ వేసుకుని జాగ్రత్తగా ఉండండి” అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు మమ్ముట్టి.