Delhi: హత్య చేసి.. మృత‌దేహాన్ని ఫ్రిజ్‌లో కుక్కి పెట్టిన వైనం

ఓ వ్య‌క్తిని చంపి, అత‌డి మృత‌దేహాన్ని ఫ్రిజ్‌లో కుక్కి పెట్టారు. ఈ దారుణ‌ ఘ‌ట‌న ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు మీడియాకు వివ‌రాలు తెలిపారు. ఫ్రిజ్‌లో మృత‌దేహాన్ని గుర్తించిన ఓ మ‌హిళ‌ గ‌త రాత్రి 7.15 గంట‌ల‌కు త‌మ‌కు ఫోన్ చేసి స‌మాచారం అందించింద‌ని అన్నారు.

Delhi: హత్య చేసి.. మృత‌దేహాన్ని ఫ్రిజ్‌లో కుక్కి పెట్టిన వైనం

Delhi: ఓ వ్య‌క్తిని చంపి, అత‌డి మృత‌దేహాన్ని ఫ్రిజ్‌లో కుక్కి పెట్టారు. ఈ దారుణ‌ ఘ‌ట‌న ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు మీడియాకు వివ‌రాలు తెలిపారు. ఫ్రిజ్‌లో మృత‌దేహాన్ని గుర్తించిన ఓ మ‌హిళ‌ గ‌త రాత్రి 7.15 గంట‌ల‌కు త‌మ‌కు ఫోన్ చేసి స‌మాచారం అందించింద‌ని అన్నారు. దీంతో వెంట‌నే తాము ఆ ఇంటికి వెళ్ళి ద‌ర్యాప్తు ప్రారంభించామ‌ని వివ‌రించారు. 50 ఏళ్ళ వ్య‌క్తిని చంపేసి, మృత‌దేహాన్ని ప్రిజ్‌లో పెట్టి నిందితులు వెళ్ళిపోయిన‌ట్లు గుర్తించామ‌ని తెలిపారు.

బాధితుడి కుటుంబానికి చెందిన వారు అత‌డికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించ‌క‌పోవ‌డంతో అత‌డి ఇంటికి వెళ్ళార‌ని చెప్పారు. ఈ నేప‌థ్యంలోనే ఫ్రిజ్‌లో అత‌డి మృత‌దేహాన్ని గుర్తించార‌ని తెలిపారు. మృతుడి పేరు జ‌కీర్ అని చెప్పారు. అత‌డు కొంత కాలంగా ఆ ఇంట్లో ఒంట‌రిగా నివ‌సిస్తున్న‌ట్లు ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో తేలింద‌ని చెప్పారు. జ‌కీర్ భార్య‌, అత‌డి పిల్ల‌లు వేరే ప్రాంతంలో ఉంటున్నార‌ని తెలిపారు. జ‌కీర్ హ‌త్య ఘ‌ట‌న‌పై త‌దుప‌రి విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని వివ‌రించారు.