Maoist Attack : రెచ్చిపోయిన మావోలు.. ఛత్తీస్‌గఢ్‌లో దారుణ హత్య
ఇన్ఫార్మర్ నెపంతో ఓ యువకుడిని దారుణంగా హతమార్చారు మావోయిస్టులు.. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

Maoist Attack
Maoist Attack : ఇన్ఫార్మర్ నెపంతో ఓ యువకుడిని దారుణంగా హతమార్చారు మావోయిస్టులు.. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని సుక్మా జిల్లా ఎరబోర పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంగ్డా గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడిని మావోలు సోమవారం రాత్రి అపహరించారు. తమ సమాచారం పోలీసులకు తెలియచేస్తున్నాడనే నెపంతో అతడిని గ్రామానికి సమీపంలో హత్యచేసి అక్కడే పడేసి వెళ్లిపోయారు.
చదవండి : Maoists : సర్పంచ్‌ను హతమార్చిన మవోయిస్టులు
నవీన్‌ను మావోయిస్టులు తీసుకెళ్లడంతో కొద్దీ సేపటి తర్వాత గ్రామస్తులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. గ్రామానికి కొద్దీ దూరంలోనే నవీన్ మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనాన స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. ఇన్ఫార్మర్ నెపంతో గుర్తుతెలియని మావోయిస్టులు నవీన్‌ను హతమార్చినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి.
చదవండి : Maoists Release : భార్య విజ్ఞప్తి.. భర్తను వదిలిన మావోయిస్టులు!