CM KCR : జనగామకు మెడికల్ కాలేజ్, పాలకుర్తికి డిగ్రీ కాలేజ్ : సీఎం కేసీఆర్

తెలంగాణ వచ్చాక కరెంట్ బాధలు పోయాయని పేర్కొన్నారు. జనగామకు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రాబోయే రెండు, మూడు రోజుల్లో జీవో ఇస్తామని చెప్పారు.

CM KCR : జనగామకు మెడికల్ కాలేజ్, పాలకుర్తికి డిగ్రీ కాలేజ్ : సీఎం కేసీఆర్

Kcr (4)

Medical College for Janagama : గతంలో బచ్చన్నపేటను చూస్తే తనకు బాధేసిందని సీఎం కేసీఆర్ అన్నారు. గతంలో జనగామను చూసి ప్రొ.జయశంకర్ ఎంతో బాధపడేవారని గుర్తు చేశారు. మంచినీళ్ల కోసం బిందెలు పట్టుకుని వెళ్లేవారని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక బచ్చన్నపేట బతుకు మారిందన్నారు. జనగామంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.

అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆఆయన ప్రసంగించారు. తెలంగాణ వచ్చాక కరెంట్ బాధలు పోయాయని పేర్కొన్నారు. జనగామాకు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రాబోయే రెండు, మూడు రోజుల్లో జీవో ఇస్తామని చెప్పారు. పాలకుర్తికి మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని అన్నారు.

Chandrababu : సీఎం పదవి నుంచి జగన్ తప్పుకోవాలి : చంద్రబాబు

ఈ ఏడాది 40 వేల కుటుంబాలకు దళితబంధు ఇస్తామని చెప్పారు. మార్చి తర్వాత ప్రతి నియోజకవర్గంలో 2 వేల కుటుంబాలకు దళిత బంధు వస్తుందన్నారు. మెడికల్ షాపులు, ఫర్టిలైజ్ షాపుల్లో రిజర్వేషన్లు పెట్టామని గుర్తు చేశారు. సంవత్సరానికి 2 నుంచి 3 లక్షల కుటుంబాలకు దళిత బంధు వస్తుందన్నారు. ప్రతి దళిత కుటుంబానికి చేయూత అందిస్తామని భరోసా ఇచ్చారు.

చనిపోయిన రైతు కుటుంబాలకు రైతు బీమా అందిస్తున్నామని చెప్పారు. ‘ప్రతి మోటార్ కు మీటర్ పెట్టాలని కేంద్రం ఒత్తిడి చేశారు… నన్ను చంపినా నేను అమలు చేయనని చెప్పాను’ అని కేసీఆర్ పేర్కొన్నారు. ‘రైతుల ఆదాయం డబుల్ చేస్తామన్నారు.. ఇప్పుడేమో రైతుల పెట్టుబడి డబుల్ అయిందన్నారు’ అని సీఎం కేసీఆర్ విమర్శించారు.