Chiranjeevi : తన వాయిస్ తో ప్రత్యేక వీడియో.. వాల్తేరు వీరయ్య విజయాన్ని సినీ కార్మికులకు అంకితమిచ్చిన మెగాస్టార్..

ఈ నేపథ్యంలో సినీ కార్మికుల గురించి ఓ వీడియో తీసి తన వాయిస్ తో ఆ వీడియోని చెప్పారు చిరంజీవి. వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ సమయంలో ఎండా, వాన, చలిలో సినీ కార్మికుల కష్టాలని వీడియో రూపంలో తీసి సినిమా మీద ఉన్న ప్రేమని, వాళ్ళ కష్టాన్ని, తన వాయిస్ తో చెప్తూ ఈ వీడియో రూపంలో.....................

Chiranjeevi : తన వాయిస్ తో ప్రత్యేక వీడియో.. వాల్తేరు వీరయ్య విజయాన్ని సినీ కార్మికులకు అంకితమిచ్చిన మెగాస్టార్..

Megastar Chiranjeevi tribute video to cinema workers

Chiranjeevi :  చిరంజీవి, శృతి హాసన్ జంటగా రవితేజ, క్యాథరిన్ ముఖ్య పాత్రల్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజయి మంచి విజయం సాధించి థియేటర్స్ లో దూసుకుపోతుంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా అభిమానులతో పాటు ప్రేక్షకులని కూడా అలరిస్తుంది. మొదటి రోజే దాదాపు 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది ఈ సినిమా. ఇక ఇప్పటికే అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ ని వసూలు చేసేసింది.

ఈ సినిమా విజయం సాధించడంతో చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శనివారం నాడు వాల్తేరు వీరయ్య సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో చిరంజీవి చాలా సేపు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఎమోషనల్ కూడా అయ్యారు. ఈ నేపథ్యంలో సినీ కార్మికుల గురించి ఓ వీడియో తీసి తన వాయిస్ తో ఆ వీడియోని చెప్పారు చిరంజీవి. వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ సమయంలో ఎండా, వాన, చలిలో సినీ కార్మికుల కష్టాలని వీడియో రూపంలో తీసి సినిమా మీద ఉన్న ప్రేమని, వాళ్ళ కష్టాన్ని, తన వాయిస్ తో చెప్తూ ఈ వీడియో రూపంలో చూపించి వాల్తేరు వీరయ్య విజయాన్ని ఆ సినిమాకి పని చేసిన సినీ కార్మికులకు అంకితమిచ్చారు మెగాస్టార్.

VV Vinayak : గుడివాడ సంక్రాంతి సంబరాల్లో VV వినాయక్.. కొడాలి నాని వల్లే ఈ స్థాయిలో ఉన్నా..

ఈ వీడియో చిరంజీవి వాయిస్ తో.. తెలుగు సినీ ప్రేక్షకులకు నా నమస్కారాలు. మా గమ్యం మిమ్మల్ని అలరించడం. అని మొదలయి సినీ కార్మికులు సినిమా బాగా రావడానికి పడ్డ కష్టాలన్నిటిని చూపించి చివర్లో.. మేమంతా సినీ క్లార్మికులం, నిరంతర శ్రామికులం. కథకి బానిసలం, కళామతల్లి సైనికులం. మేమంతా సినిమా ప్రేమికులం. సినిమానే మా కులం, సినిమానే మా శ్వాస, సినిమానే మా గమ్యం. మా గమ్యం మిమ్మల్ని అలరించడం. ఇంతటి అంకిత భావంతో పని చేస్తున్న ప్రతి ఒక్క సినీ కార్మికుడికి నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నా. మీ కష్టమే వాల్తేరు విజయానికి కారణం. ఇట్లు.. మీ చిరంజీవి అని ముగిసింది. ఈ వీడియో చూసి వాల్తేరు వీరయ్య చిత్రయూనిట్ తో పాటు సినిమా కార్మికులు, సినీ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తూ మెగాస్టార్ ని అభినందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.