VV Vinayak : గుడివాడ సంక్రాంతి సంబరాల్లో VV వినాయక్.. కొడాలి నాని వల్లే ఈ స్థాయిలో ఉన్నా..

సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న వినాయక్ మీడియాతో మాట్లాడుతూ.. ఇక్కడ సంక్రాంతి సంబరాలు బాగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ఇలాగే ఆనందంగా జరుపుకోవాలి. గుడివాడలో జరుగుతున్న....................

VV Vinayak : గుడివాడ సంక్రాంతి సంబరాల్లో VV వినాయక్.. కొడాలి నాని వల్లే ఈ స్థాయిలో ఉన్నా..

VV Vinayak participated in gudivada sankranthi sambaralu

VV Vinayak :  రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు సంక్రాంతి సంబరాల్లో మునిగారు. పట్టణాల్లో నివసించే వాళ్లంతా పల్లెటూళ్ళకి వెళ్లారు. పలువురు సెలబ్రిటీలు కూడా తమ సొంతూళ్లకు, ఆంధ్రప్రదేశ్ లోని పలు ఊళ్ళకి తరలి వెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు VV వినాయక్ గుడివాడ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని నిర్వహించించిన జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండి లాగుడు పోటీలకు వినాయక్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

అక్కడికి వచ్చిన ప్రజలని, ప్రజాప్రతినిథులని పలకరించారు వినాయక్. ఎండ్ల బండి లాగుడు పోటీలని చూసి ఎంజాయ్ చేశారు. అనంతరం కొడాలి నాని ఆతిథ్యం తీసుకున్నారు వినాయక్. గతంలో కొడాలి నాని నిర్మాతగా ఎన్టీఆర్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో సాంబ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతుంది.

Dil Raju : సొంత థియేటర్‌ని ప్రారంభించిన దిల్‌రాజు.. SVC సినిమాస్..

ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న వినాయక్ మీడియాతో మాట్లాడుతూ.. ఇక్కడ సంక్రాంతి సంబరాలు బాగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ఇలాగే ఆనందంగా జరుపుకోవాలి. గుడివాడలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండి లాగుడు పోటీలని మొదటి సారి చూస్తున్నాను. ఈ ప్రదర్శనలు చాలా బాగున్నాయి. నేను డైరెక్ట్ చేసే హిందీ సినిమా సమ్మర్ లో రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత తెలుగు సినిమా తీస్తాను. కొడాలి నాని వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా. ఆయన మళ్ళీ సినిమా చేద్దామంటే నేను రెడీ అని అన్నారు.