Dil Raju : సొంత థియేటర్‌ని ప్రారంభించిన దిల్‌రాజు.. SVC సినిమాస్..

హైదరాబాద్ AS రావు నగర్ లో SVC సినిమాస్ పేరుతో ఓ మల్టిప్లెక్స్ ని ఓపెన్ చేశారు. దిల్ రాజు కూతురు హర్షిత రెడ్డి, శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి, అంకిత్ రెడ్డిలు ఈ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేడు దిల్ రాజు నిర్మించిన............

Dil Raju : సొంత థియేటర్‌ని ప్రారంభించిన దిల్‌రాజు.. SVC సినిమాస్..

Dil Raj started own theater in Hyderabad named SVC Cinemas

Dil Raju :  టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా సినీ ప్రయాణం మొదలుపెట్టి నిర్మాతగా ఎదిగారు. ఇప్పటికే చాలా సినిమాలని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాగే తన ఫ్యామిలీ కూడా సినీ రంగంలోకి వచ్చింది. దిల్ రాజు తమ్ముడు శిరీష్ నిర్మాతగా కొనసాగుతున్నాడు. ఇటీవలే దిల్ రాజు కూతురు హర్షిత రెడ్డి కూడా నిర్మాతగా మారింది. ఇక శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి హీరోగా సినిమాలు చేస్తున్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తూ, డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఫ్యామిలీ అంతా బిజీగా ఉన్నారు. నైజాంలో డిస్ట్రిబ్యూటర్ గా చాలా థియేటర్స్ దిల్ రాజు చేతిలో ఉన్నాయి అని టాక్ కూడా వినిపిస్తుంది. ఇటీవల సంక్రాంతి సినిమాల రిలీజ్ టైములో కూడా ఈ టాక్ బయటకి వచ్చి థియేటర్స్ వివాదం వచ్చింది. తాజాగా దిల్ రాజు తన సొంత థియేటర్ ని ఓపెన్ చేశారు.

Raju Yadav Teaser : ఖర్మకాలి జీవితాంతం నవ్వుతూనే ఉండాల్సి వస్తే.. గెటప్ శ్రీను హీరోగా రాజు యాదవ్ టీజర్ రిలీజ్..

హైదరాబాద్ AS రావు నగర్ లో SVC సినిమాస్ పేరుతో ఓ మల్టిప్లెక్స్ ని ఓపెన్ చేశారు. దిల్ రాజు కూతురు హర్షిత రెడ్డి, శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి, అంకిత్ రెడ్డిలు ఈ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేడు దిల్ రాజు నిర్మించిన వారసుడు సినిమాతో ఈ థియేటర్ అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తుంది. దిల్ రాజు కూతురు ఈ థియేటర్ వ్యవహారాలు చూసుకోనున్నట్టు సమాచారం.