Hyderabad Metro: సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8గంటల వరకు ఆ మూడు స్టేషన్లలో మెట్రో సేవలు బంద్

పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా భద్రతా కారణాల రిత్యా మూడు మెట్రో స్టేషన్లలో సాయంత్రం 5.30గంటల నుంచి రాత్రి 8గంటల వరకు మెట్రో ట్రైన్ రాకపోకలను నిలిపివేస్తున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

Hyderabad Metro: సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8గంటల వరకు ఆ మూడు స్టేషన్లలో మెట్రో సేవలు బంద్

Hyderabad Metro: హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు, ఇతర రాష్ట్రాల సీఎంలు హైదరాబాద్ లో ఉన్నారు. దీనికితోడు ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ జరగనుంది. సుమారు 10లక్షల మందితో ఈ సభ నిర్వహించేందుకు రాష్ట్ర బీజేపీ అధిష్టానం కృషి చేస్తోంది. ఈ సభకు ప్రధాని మోదీతో సహా జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు పాల్గోనున్నారు. ఇప్పటికే పరేడ్ గ్రౌండ్ సహా పరిసర ప్రాంతాలను ఎస్పీజీ బలగాలు తమ ఆదీనంలోకి తీసుకున్నాయి. భారీ సంఖ్యలో పోలీసులను సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో మోహరించారు. అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Metro Trains : నేడు సాధారణంగానే మెట్రో రైళ్లు నడుస్తాయి : ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి

పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా భద్రతా కారణాల రిత్యా మూడు మెట్రో స్టేషన్లలో సాయంత్రం 5.30గంటల నుంచి రాత్రి 8గంటల వరకు మెట్రో ట్రైన్ రాకపోకలను నిలిపివేస్తున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. పేరేడ్ గ్రౌండ్, పారడైజ్, జేబీఎస్ స్టేషన్లో ఈ సమయంలో ట్రైన్లు ఆగవని తెలిపారు. రాత్రి 8గంటల తరువాత యధావిధిగా రైళ్లు నడుస్తాయని ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. సీబీఎస్ నుండి జేబీఎస్ కారిడార్లో నడిచే ట్రైన్లు ఈ సమయంలో సికింద్రాబాద్ వెస్ట్ వరకు మాత్రమే నడుస్తాయని, ప్రయాణికులు అందుకు అనుగుణంగా తమ ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని, ఇతర మార్గాలలో ఎలాంటి మార్పుఉండవని మెట్రో రైల్ ఎండీ తెలిపారు.