Microsoft : విద్యార్థులకు గొప్ప అవకాశం, వర్చువల్‌ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రాం.. ఇలా అప్లయ్ చేసుకోండి

ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. సాంకేతిక నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలను విద్యార్థుల్లో పెంపొందించడం కోసం ఫ్యూచర్‌ రెడీ టాలెంట్‌ వర్చువల్‌ ఇంటర్నషిప్‌

Microsoft : విద్యార్థులకు గొప్ప అవకాశం, వర్చువల్‌ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రాం.. ఇలా అప్లయ్ చేసుకోండి

Microsoft Internship

Microsoft Internship : ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. సాంకేతిక నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలను విద్యార్థుల్లో పెంపొందించడం కోసం ఫ్యూచర్‌ రెడీ టాలెంట్‌ వర్చువల్‌ ఇంటర్నషిప్‌ ప్రోగ్రాంను లాంచ్‌ చేసింది. ఈ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను మైక్రోసాఫ్ట్‌ ఆహ్వనిస్తుంది. సుమారు 50 వేల మంది విద్యార్థులు ఇంటర్నషిప్‌ ప్రోగ్రాంలో పాల్గొనొచ్చు. మైక్రోసాఫ్ట్ అజూర్, గిట్‌హబ్ టూల్స్ వంటి సాధనాలను ఉపయోగించి వ్యాపార సవాళ్లను పరిష్కరించడానికి, వినూత్న పరిష్కారాలను రూపొందించడానికి విద్యార్థులను సిద్ధం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యమని మైక్రోసాఫ్ట్‌ తెలిపింది.

Paytm బంపర్ ఆఫర్.. 100 శాతం క్యాష్‌బ్యాక్, కండీషన్స్ అప్లయ్

* ఈ ప్రోగ్రాంతో విద్యార్థులు గిట్‌హబ్‌ స్టూడెంట్ డెవలపర్ ప్యాక్‌ను యాక్సెస్ చేయవచ్చు.
* 2021 గ్రాడ్యుయేషన్‌ పూర్తైన విద్యార్థులు పాల్గొనొచ్చు.
* 2022, 2023లో గ్రాడ్యుయేట్‌ అయ్యే విద్యార్థులు కూడా పాల్గొనే అవకాశం.
* ఏదైనా స్పెషలైజేషన్‌ను కలిగిన విద్యార్థులు ఈ ప్రోగాంకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Malware ముప్పు.. బ్యాంకు యూజర్లకు వార్నింగ్, క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ

* ఫ్యూచర్ రెడీ టాలెంట్ ‘https://futurereadytalent.in’ వెబ్‌సైట్‌లో అప్లయ్ చేసుకోవచ్చు.
* దరఖాస్తు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 29.
* ఇంటర్న్‌షిప్ వ్యవధి సుమారు 8 వారాలు
* మైక్రోసాఫ్ట్ తన లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ మైక్రోసాఫ్ట్ లెర్న్ ద్వారా లెర్నింగ్ మాడ్యూల్స్ సర్టిఫికేషన్‌లను విద్యార్థులకు అందిస్తుంది.
* క్లౌడ్ కంప్యూటింగ్, డేటా, కృత్రిమ మేధస్సు, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాలపై విద్యార్థులకు మైక్రోసాఫ్ట్‌ శిక్షణ.

All India Council for Technical Education (AICTE), FutureSkills Prime-a NASSCOM, Ministry of Electronics and Information Technology (MeitY) digital skilling initiative, Ernst & Young (EY), GitHub and Quess Corp భాగస్వామ్యంతో ఇంటర్న్ షిప్.

* ఆసక్తి ఉన్న విద్యార్థులు AICTE TULIP పోర్టల్ చూడాలి.
* అభ్యర్థులు ముందుగా TULIP పోర్టల్ లో రిజిస్ట్రర్ చేసుకోవాలి.
* ఇన్ స్టిట్యూట్ పేరు, స్టూడెంట్ ఐడీ, విద్యార్థి పేరు, సిటీ పేరు, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది.
* రిజిస్ట్రేషన్ అయ్యాక విద్యార్థులు మెయిల్ ఐడీ, పాస్ వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి ఇంటర్న్ షిప్ కి అప్లయ్ చేసుకోవచ్చు.
* మరింత సమాచారం కోసం అఫిషియల్ వెబ్ సైట్ ను సందర్శించాలి.