Three Point Seat Belt : కొత్త రూల్..కారు బ్యాక్ సీటు మధ్యలో కూర్చునేవారుకూడా సీట్‌బెల్ట్‌ పెట్టుకోవాల్సిందే..

వాహనదారులకు మరో కొత్త రూల్..కారు బ్యాక్ సీటు మధ్యలో కూర్చునేవారు కూడా సీట్‌బెల్ట్‌ పెట్టుకోవాల్సిందే.

Three Point Seat Belt : కొత్త రూల్..కారు బ్యాక్ సీటు మధ్యలో కూర్చునేవారుకూడా సీట్‌బెల్ట్‌ పెట్టుకోవాల్సిందే..

Three Point Seat Belt

Three Point Seat Belt: వాహనదారుల సేఫ్టీ కోసం కొత్త ట్రాఫిక్ రూల్స్ తీసుకొస్తోంది ప్రభుత్వం. బైక్ నడిపేవారే కాదు వెనుక కూర్చున్నవారు కూడా హెల్మెట్ పెట్టుకోవటం తప్పనిసరి అనే విషయం తెలిసిదే. అలాగే కారు నడిపేవారితో పాటు పక్క సీటులో కూర్చున్నవారు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని రూల్స్ పెట్టింది. అలాగే బ్యాక్ సీటులో కూర్చున్నవారు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అంతేకాదు వెనుక సీటులో కూర్చున్నవారు అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో కూర్చున్నవారే కాదు మధ్య సీటులో కూర్చున్నవారు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిందేనంటూ కొత్తగా మరో రూల్ తీసుకురానుంది ప్రభుత్వం. ఈ కొత్త నిబంధన ప్రకారం ఇకనుంచి కారు వెనుకసీటు మధ్యలో కూర్చున్న వ్యక్తి కూడా సీటు బెల్ట్‌ ధరించాల్సి ఉంటుంది.

Also read : PM Modi : స్వార్ధరాజకీయల కోసమే ఏపీని హడావిడిగా విభజించారు..తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని కీలక వ్యాఖ్యలు..

కాబట్టి కారు తయారీదార్లు ఇకనుంచి మధ్య సీటులో కూర్చున్నవారు కూడా సీటు ధరించేలా బెల్ట్ ఏర్పాటు చేయాలన్నమాట. కార్ల తయారీదారులు ఇకపై అన్ని సీట్లలో అంటే ముందు వెనుక సీట్లతో పాటు 3-పాయింట్ సీట్ బెల్ట్‌ను ఉపయోగించాలి. సీటు మధ్యలో కూర్చున్న వ్యక్తికి సరిపడేలా సీటు బెల్టు ఉండాలని ఈ కొత్త నిబంధనలో ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం ఉన్న రూల్ కారులో ముందు సీటులో ఇద్దరు, వెనుక సీటులో ఇద్దరు సీటు బెల్ట్ ధరించేలా ఉంది. వెనుక సీటు మధ్యలో కూర్చున్న వ్యక్తికి సీటు బెల్ట్ పెట్టుకునే ఏర్పాటులేదు. కానీ కొత్త రూల్ అమలు జరగాలంటే..బ్యాక్ సీటు మధ్యలో కూర్చున్నవారు బెల్ట్ ధరించేలా కార్ల తయారీ దారులు ఏర్పాటుచేయాల్సి ఉంటుంది.ప్రస్తుతం చాలా కార్లు 2 పాయింట్ల సీట్ బెల్ట్‌ను మాత్రమే ఉపయోగిస్తున్నాయి. ఇక నుంచి వై-ఆకారపు సీట్‌బెల్ట్‌ను అన్ని సీట్లలో తప్పనిసరిగా అమర్చాలి.

కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు సోమవారం (ఫిబ్రవరి 7,2022)మాట్లాడుతూ “భారతదేశంలో తయారు చేసే కారు సురక్షితమైన, మెరుగ్గా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. చాలా కంపెనీలు తయారు చేసే కార్లలో 3 పాయింట్ల సీట్ బెల్ట్ ఉండటం లేదు. కేవలం 2 పాయింట్ల సీటు బెల్ట్ మాత్రమే ఉంటుంది వెనుక సీటులో ఉన్నవారికి సీట్ బెల్ట్ ఉండటం లేదు. దీనివల్ల ప్రమాదం జరిగినప్పుడు 2 పాయింట్ల సీటు బెల్టులు ధరించే వారికి ఎక్కువ నష్టం జరుగుతుంది. ప్రాణనష్టం సంభవించవచ్చు. దీనిని నివారించడానికి ప్రభుత్వం 3-పాయింట్ లేదా Y- ఆకారపు సీట్ బెల్ట్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.

Also read : Andhra Pradesh Bifurcation: ఏపీ విభజనలో కాంగ్రెస్ అధికార గర్వమే కనిపించింది – ప్రధాని మోదీ

2 పాయింట్ల సీటు బెల్ట్ కంటే 3 పాయింట్ల సీటు బెల్ట్ సురక్షితమైనదని శాస్త్రీయంగా నిరూపించారు. 3 పాయింట్ల సీట్ బెల్ట్ ధరించినప్పుడు శరీరాన్ని పూర్తిగా కదలకుండా బెల్ట్ పట్టుకుని భుజాన్ని అలాగే ఉంచుతుంది. అందువల్ల ప్రమాదం జరిగినప్పుడు ఎటువంటి గాయాలు కాకుండా ఉంటుంది. 1959లో వోల్వో తన వాహనాలకు 3 పాయింట్ల సీట్ బెల్ట్‌లను ప్రవేశపెట్టి పేటెంట్ పొందింది. కారు భద్రతపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం ఇది రెండోసారి. దీనికి ముందు కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి చేసింది.

కాగా గతంలో వలె కాకుండా వాహనాల వాడకాలు పెరుగుతున్నాయి. కొనుగోలు పెరుగుతోంది. ఈ క్రమంలో వాహనాల ప్రమాదాల్లో భద్రత కోసం ట్రాఫిక్ రూల్స్ ను పెంచుతోంది ప్రభుత్వం. దాంట్లో భాగంగానే పలు నిబంధనలను ప్రవేశపెడుతోంది.