Smart Phones Risk : 67శాతం ఆండ్రాయిడ్ ఫోన్లకు ఈ ప్రమాదం తప్పదంటున్న నిపుణులు..బీకేర్ ఫుల్

67శాతం ఆండ్రాయిడ్ ఫోన్లకు ఈ ప్రమాదం తప్పదంటున్నారు నిపుణులు..

Smart Phones Risk : 67శాతం ఆండ్రాయిడ్ ఫోన్లకు ఈ ప్రమాదం తప్పదంటున్న నిపుణులు..బీకేర్ ఫుల్

Millions Of Android Smartphones Could Be Attacked Using A Media File All Details

Android Smartphones Could Be Attacked Using A Media File : మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా…?అయితే బీకేర్‌ఫుల్‌… ఈ ముప్పు పొంచి ఉంది… భారీ మాల్‌వేర్‌ ఓ మీడియా ఫైల్‌ రూపంలో కాటేసేందుకు మాటేసింది. మా ఫోన్‌కేం కాదులే అనుకోవద్దు ఎందుకంటే దాదాపు 67శాతం ఫోన్లకు ఈ వైరస్‌ ముప్పు పొంచి ఉందట. ఆండ్రాయిడ్‌ వాడేవారు ఓసారి మీ ఫోన్‌ను చెక్‌ చేసుకోండి. సెక్యూరిటీ చెక్‌ రన్‌ చేయండి. ఎందుకంటే ఓ భయంకరమైన మాల్‌వేర్‌తో ఆండ్రాయిడ్‌ యూజర్లను టార్గెట్ చేసారు హ్యాకర్లు. అది ఇప్పటికే మీ ఫోన్‌లో ఎంటరైనా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. లేదా ఎప్పుడెప్పుడు ఎటాక్‌ చేద్దామా అని వెయిట్‌ చేస్తూ ఉంది.

రిస్క్‌లో లక్షలు, కోట్ల ఫోన్లు..
ఫోన్లు వాటికి మాల్‌వేర్‌లు కామనే… ఆండ్రాయిడ్‌ ఫోన్లకు ఈ ముప్పు కాస్త ఎక్కువే. ప్రతిసారీ సమస్యలు రావడం కంపెనీలు సెక్యూరిటీ ప్యాచ్‌ అప్‌డేట్స్‌ చేయడం జరుగుతూనే ఉంటుంది. అయితే ఈసారి అలాంటి ఇలాంటి కాదు ఓ పెద్ద సమస్యే వచ్చి పడింది. ఒకటి కాదు రెండు కాదు కొన్ని లక్షలు, కోట్ల ఫోన్లను రిస్క్‌లో పెట్టింది. ఓ ఆడియో ఫైల్‌ రూపంలో ఫోన్‌లోకి చొరబడే ఈ మాల్‌వేర్‌ ఇక ఫోన్‌ మొత్తాన్ని తన చెప్పుచేతుల్లోకి తీసేసుకుంటుంది. మీకు తెలియకుండానే మీ మొబైల్‌లోని డాటా అంతా కొట్టేస్తుంది.

Also read : Nokia G21 : ఏప్రిల్ 26న నోకియా కొత్త బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చంటే?

67శాతం ఫోన్లకు ఈ మాల్‌వేర్‌ ముప్పు..
మొత్తం 67శాతం ఫోన్లకు ఈ మాల్‌వేర్‌ ముప్పు పొంచి ఉంది. ఎక్కువ ఆండ్రాయిడ్‌ ఫోన్లు క్వాల్‌కామ్‌, మీడియాటెక్‌ చిప్‌సెట్లపై రన్ అవుతుంటాయి. దానికి ALAC కోడింగ్‌ను వాడారు. అదే ఇప్పుడు చాలామంది స్మార్ట్‌ఫోన్ యూజర్లను హ్యాకింగ్ ప్రమాదంలో పడేసింది. ఆడియో సంభాషణ ద్వారా మాల్‌వేర్‌ను పంపి ఫోన్‌ను హ్యాక్‌ చేస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సగం ఫోన్లలో ఈ ALAC డీకోడర్‌ను ఉపయోగించినట్లు తెలుస్తోంది.

హ్యాకర్ల చేతిలోకి మీ వ్యక్తిగత సమాచారం
ఒక్కసారి ఆ మాల్‌వేర్‌ ఫోన్‌లోకి ఎంటరైతే చాలు ఇక మొత్తం అదే చూసుకుంటుంది. ఫోన్‌ మీదే కానీ ఆపరేటింగ్ దానిది… మీ వ్యక్తిగత సమాచారం హ్యాకర్లకు వెళ్లిపోతుంది. మీ ఫోటోలు వారికి చేరిపోతాయి. మీ బ్యాంక్‌ అకౌంట్‌ డీటైల్స్ వారికి చేరతాయి. మీరేమైనా పిన్‌ నెంబర్ల వంటివి సేవ్‌ చేసి ఉంటే వారికి ఇక పండగే… ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అంతెందుకు మీ ఫోన్‌ కెమెరాను కూడా మీకు తెలియకుండా వారు ఆపరేట్ చేయవచ్చు. అంటే మీరు బెడ్‌రూమ్‌లో ఉన్నా లేక మరెక్కడైనా ఉన్నా మనకు తెలియకుండానే ఫోన్‌ ఫోటోలు తీసేస్తుంది. వారికి పంపేస్తుంది. మీ ఫోన్‌లో మీరేం చూస్తున్నారో కూడా వారు రిమోట్‌లో ఇంకెక్కడి నుంచో మానిటర్ చేస్తారు. ఇదే ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్లను భయపెడుతోంది. మా ఫోన్లకేం కాదు అనుకోవడానికి లేదు. ఎవరి ఫోన్ అయినా హ్యాకర్లు తమ నియంత్రణలోకి తీసుకునే ప్రమాదం ఉంది.

Best Mobiles April 2022 : ఈ నెలలో రూ.20వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే.. ఫీచర్లు, ధర ఎంతంటే?

ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే..
ఈ ముప్పు నుంచి బయటపడాలంటే యూజర్ల ముందున్న మార్గం ఎలాంటి ఆడియో ఫైల్స్ ఓపెన్‌ చేయకపోవడమే. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఆడియో ఫైల్స్‌ లేదా మెయిల్స్‌ను డిలీట్‌ చేసేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని ఓపెన్ చేయకూడదు. చేశారా ఇక అంతే సంగతులు. ఆ ఆడియో ఫైల్‌ బాగానే ఓపెన్ అవుతుంది. ప్లే అవుతుంది. అందులో ఏం లేదులే అనుకుంటాం. కానీ అదే డేంజర్‌… తెరవెనక దాని పని అది చేసుకుపోతుంది. సో బీ కేర్‌ఫుల్‌… ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని వారి నుంచి వచ్చే ఆడియో ఫైల్స్ ఓపెన్ చేయకండి. తెలిసి తెలిసి మీ ఫోన్‌ను హ్యాకర్ల చేతిలో పెట్టకండి….