Telangana : మహిళల గురించి మాట్లాడే అర్హత బీజేపి నేతలకు లేదు : మంత్రి హరీశ్ రావు
మహిళల గురించి మాట్లాడే అర్హత బీజేపి నేతలకు లేదని మహిళలకు అవమానించే ఘనత బీజేపీకే దక్కుతుందని మంత్రి హరీశ్ రావు బీజేపీ నేతలపై మండిపడ్డారు.

Minister Harish Rao Fires On Bpl Leaders
Minister harish rao fires on bpl leaders : గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 7 తేదీ (సోమవారం) నుంచి తెలంగాణ రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. దీనిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించటం అంటే గవర్నర్ ను అవమానించటమేనని..మహిళలకు అవమానించటమేనని విమర్శించారు.
Also read : Telangana Government : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు
బీజేపీ నేతల వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఎటాక్ ఇచ్చారు.అసలు మహిళలను అవమానించింది బీజేపీ నేతలేనని మండిపడ్డారు.మహిళ అయినందుకు గవర్నర్‌ను బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించేందుకు ఆహ్వానించలేదని బీజేపీ నేతలు మాట్లాడడం హాస్యాస్పందంగా ఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. టీఆర్‌ఎస్ ఎల్పీలో మంగళవారం (మార్చి 1,2022)మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు హరీశ్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోడీ ప్రధాని కాగానే.. గుజరాత్ గవర్నర్ కమలాబేణి వాల్‌ను డిస్మస్ చేశారని, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ఇటీవల అందరు మాతృమూర్తులను అవమానించారని..‘రాహుల్ గాంధీ ఎవరికి పుట్టారో మేం అడిగామా?అని అసోం సీఎం వ్యాఖ్యల గురించి ఉద్ధేశించి గుర్తు చేశారు. అసోం సీఎం వ్యాఖ్యలను బండి సంజయ్ సమర్థించలేదా? అని ప్రశ్నించారు. అటువంటి బీజేపీ నేతలు మాకు మహిళలను గౌరవించటం గురించి చెపుతారా?అని ప్రశ్నించారు.
Also read : Raja singh fire on KCR: ఇది గవర్నర్‌ను అవమానించడమే- ఎమ్మెల్యే రాజాసింగ్
మహిళల గురించి..వారిని గౌరవించే విధానం గురించి బీజేపీ నేతలకు మాట్లాడే అర్హత లేదని కౌంటర్ ఇచ్చారు. గవర్నర్ వ్యవస్థలకు అవమానించేది బీజేపీయే నని..రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించటంలో సీఎం కేసీఆర్ ముందుంటారని అన్నారు. కొత్త సెషన్ అయితే మాత్రమే గవర్నర్ ప్రసంగం ఉంటుందని..ఇప్పుడు జరిగే సెషన్ గతంలో జరిగిన సమావేశాలకు కొనసాగింపు మాత్రమేనని తెలిపారు మంత్రి హరీశ్ రావు. రాష్ట్రాల హక్కుల్ని కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని తెలంగాణాకు రావాల్సినవి అడిగితే అది దేశ ద్రోహమా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీని విమర్శించే ముందు బండి సంజయ్ తన పార్టీలో చెలరేగుతున్న అసమ్మతిని సర్ధుబాటు చేసుకోవాలని సూచించారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం దారి చూపే కాగడ అయితే.. బీజేపీది వెలుగునివ్వని దీపమని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ ఓ సారి రాజ్యాంగాన్ని చదువుకోవాలని..డి సంజయ్ మీద ఆ పార్టీలోనే అసమ్మతి ఉందని, రాజ్యాంగం మీద, గవర్నర్ వ్యవస్థపై సీఎం కేసీఆర్‌కు గౌరవం ఉందన్నారు. గవర్నర్ వ్యవస్థను అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఎలా దుర్వినియోగం చేసిందో ప్రజలకు తెలుసని..బలం లేకున్నా అర్ధరాత్రి సీఎంలతో ప్రమాణం చేయించిన ఘనత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదన్నారు. చిన్న చిన్న విషయాలకు రాద్ధాంతం సరికాదని, ప్రోరోగ్ కాలేదు కనుకనే గవర్నర్‌ను పిలువలేదన్నారు. దేశ భక్తి గురించి మాకు బీజేపీ చెప్పనవసరం లేదని, పీఎం మోడీ పాక్‌కు వెళ్లి ఎవరి విందు స్వీకరించారో ఒకసారి గుర్తు చేసుకోవాలని కౌంటర్ ఇచ్చారు. రాజకీయ రంగు పులిమితే అది బీజేపీకే తగులుతుందని, మాతృమూర్తులను అవమానించిన బీజేపీకి మహిళల గురించి మాట్లాడే హక్కే లేదన్నారు.
ఎవరు మహిళలను అవమానపరుస్తున్నారో తెలుస్తుందన్నారు. రాజ్‌భవన్‌కు బీజేపీ వాళ్లు ఎందుకు కాషాయ రంగు పులుముతున్నారు? అని ప్రశ్నించారు. గవర్నర్‌ను రాజకీయాల్లోకి లాగుతుదన్నది బీజేపీ నేతలలేనని, ఏదైనా ఉంటే శాసనసభ సచివాలయం, రాజ్‌భవన్‌లు చూసుకుంటాయని అన్నారు. గవర్నర్ వ్యవస్థపై కేసీఆర్‌కు గౌరవం ఉందని, గతంలో గవర్నర్ నరసింహన్‌ను ఇప్పుడు.. తమిళిసైని గౌరవిస్తున్నారని మంత్రి హరీశ్ రావు స్పష్టంచేశారు.