Minister KTR : మోదీ ఆదానీకి మాత్రమే దేవుడు ప్రజలకు కాదు

మోదీ ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెంచేసినందుకు దేవుడా? లేదా వంట గ్యాస్ ధర రూ.1200లకు పెంచినందుకు దేవుడా?

Minister KTR : మోదీ ఆదానీకి మాత్రమే దేవుడు ప్రజలకు కాదు

KTR PM Modi

MInister KTR : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేశారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ మరోసారి ప్రధాని మోడీపైనా..బీజేపీ ప్రభుత్వంపైనా మండిపడ్డారు. మోదీ దేవుడు అంటూ బీజేపీ నేతలు పొగిడేస్తుంటారు. కానీ మోదీ ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెంచేసినందుకు దేవుడా? లేదా వంట గ్యాస్ ధర రూ.1200లకు పెంచినందుకు దేవుడా? అని ప్రశ్నించారు. అదానీకి మాత్రమే ప్రధాని మోదీ దేవుడు కానీ ప్రజలకు కాదన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు అన్నీ అదానీకి కట్టబెట్టి మోదీ ఆదానీకి మాత్రమే దేవుడు ప్రజలకు కాదన్నారు.

మోదీని దేవుడు అంటూ ఆకాశానికి ఎత్తేసే బండి సంజయ్ కు దమ్ముంటే బెల్లంపల్లిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయండి అంటూ సవాల్ విసిరారు. తెలంగాణకు మకుటాయమానంగా ఉండే సింగరేణి నాలుగు బొగ్గుబావులను వేలానికి పెడుతున్నారు? అందుకు మోదీ దేవుడా? అన్ని ప్రశ్నించారు. వ్యక్తిత్వ హననం చేస్తు శిఖండి రాజకీయాలు చేసే బీజేపీ ప్రజలకు ఒరగబెట్టింది ఏమీలేదంటూ విమర్శించారు మంత్రి కేటీఆర్. తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తున్న కేటీఆర్ నీటి ప్రాజెక్టుల నిర్మాణంతో అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అటువంటి కేసీఆర్ ను మూడో సారి ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణను మరింతగా డెవలప్ అయ్యేలా చేయాలని ఈ సందర్బంగా కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణలు మరోసారి ఆగం చేయాలని కొంతమంది చూస్తున్నారని వారి బూటకపు మాటలు నమ్మవద్దు అంటూ ప్రజలకు సూచించారు.

Telangana : ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారంటూ ప్రియాంకాగాంధీ తెలంగాణ టూర్‌పై కేటీఆర్ సెటైర్లు

55 ఏళ్లలో మీరు చేయలేని అభివృద్దిని సీఎం కేసీఆర్ కేవలం తొమ్మిదేళ్లలోనే చేసి చూపించారని అందుకే తెలంగాణలో కేసీఆర్ ను మరోసారి సీఎంను చేయాలని ప్రజలను పిలుపునిస్తు కాంగ్రెస్ పై విమర్శలు చేశారు కేటీఆర్. బెల్లంపల్లికి ఐటీ కంపెనీ వస్తోందని దీన్ని అభివృద్ధి అనరా? అంటూ ప్రశ్నించారు. కాగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తు..కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీలో రూ.2వేల కోట్లతో 4వ ప్లాంట్ విస్తరణ పనులను కేటీఆర్ శంకుస్థాపన చేశారు. బెల్లంపల్లిలో రూ.94.89 కోట్లతో 350 ఎకరాల్లో పుడ్ ప్రాసెసింగ్ జోన్ కు శంకుస్థాపన చేశారు.