Minister KTR : మంత్రి కేటీఆర్ కు కరోనా

తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

Minister KTR : మంత్రి కేటీఆర్ కు కరోనా

Minister Ktr Tests Positive For Covid 19

COVID-19 : తెలంగాణ రాష్ట్రంలో కరోనా మరోసారి విలయతాండవం చేస్తోంది. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. సామాన్యుడి నుంచి మొదలుకుని ప్రముఖులు సైతం వైరస్ బారిన పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం కేటీఆర్ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు.

తనకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, తనను కలిసిన వారు టెస్టులు చేయించుకోవాలని కేటీఆర్ సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో కరోనా బాధితుల సంఖ్య మూడుకు చేరుకుంది. ఇప్పటికే సీఎం కేసీఆర్, ఎంపీ సంతోష్ కు కరోనా సోకింది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈనెల 19వ తేదీన కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించారు. స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అందులో పాజిటివ్ వచ్చింది. దీంతో ఫామ్ హౌస్ లో హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఏప్రిల్ 21వ తేదీన యశోదా ఆసుపత్రికి వచ్చిన కేసీఆర్ కు మరోసారి పరీక్షలు నిర్వహించారు. అంతా నార్మల్ గానే ఉందని వైద్యులు వెల్లడించారు.