Mithali Raj: క్రికెట్‌కు మిథాలీ రాజ్ గుడ్‌బై!

భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. వన్డే, టెస్టు జట్టు కెప్టెన్‌గా కొనసాగుతున్న మిథాలీ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించింది. బుధవారం సోషల్ మీడియా ద్వారా తన రిటైర్మెంట్ అనౌన్స్ చేసింది.

Mithali Raj: క్రికెట్‌కు మిథాలీ రాజ్ గుడ్‌బై!

Mithali Raj

Mithali Raj: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. వన్డే, టెస్టు జట్టు కెప్టెన్‌గా కొనసాగుతున్న మిథాలీ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించింది. బుధవారం సోషల్ మీడియా ద్వారా తన రిటైర్మెంట్ అనౌన్స్ చేసింది. తనకు ఇన్నాళ్లు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, జీవితంలో రెండో ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తున్నానని తెలిపింది. 39 ఏళ్ల మిథాలీ పదహారేళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టింది. ఇన్నేళ్ల క్రికెట్ కెరీర్లో ఎన్నో రికార్డులు నెలకొల్పింది. ముఖ్యంగా భారత మహిళా క్రికెట్‌కు ఎన్నో విజయాలు అందించి గుర్తింపు సాధించిపెట్టింది.

Dutch MP: నుపుర్ శర్మ వివాదం.. భారత్‌కు డచ్ ఎంపీ మద్దతు

మహిళా క్రికెట్లో అంతర్జాతీయంగా అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచింది. టీ ట్వంటీలు, వన్డేలు, టెస్టులు కలిపి 333 మ్యాచులాడి అంతర్జాతీయ క్రికెట్లో 10,686 పరుగులు చేసింది. వన్డేల్లో 7,000 పరుగులు సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచింది. మిథాలి కెప్టెన్‌గా రెండు వరల్డ్ కప్పుల్లో జట్టును ఫైనల్ చేర్చింది. వన్డేల్లో 7 సెంచరీలు, టెస్టుల్లో ఒక సెంచరీ సాధించింది. మిథాలి చివరిగా గత వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులో ఆడింది. క్రీడా రంగంలో మిథాలి చేసిన సేవలకు గాను అర్జున, పద్మశ్రీ అవార్డులు దక్కాయి.