MLC Elections : ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడే నోటిఫికేషన్

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను బుధవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. తెలంగాణలో ఎమ్మెల్యే కోటా కింద 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.

MLC Elections : ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడే నోటిఫికేషన్

Mlc Elections

MLC Elections : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను బుధవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. తెలంగాణలో ఎమ్మెల్యే కోటా కింద 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనికోసం ఎన్నికల సంఘం నేడు నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇక అభ్యర్థులు ఈ నెల 16 వరకు నామినేషన్లు సమర్పించవచ్చు.

చదవండి : MLC Elections : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు…ఆరు స్థానాలూ టీఆర్ఎస్‌కే..!

నామినేషన్ల పరిశీలన 17వ తేదీన ఉండగా 22వ తేదీ వరకు నామినేషన్ ఉపసంహరించుకోవచ్చు. 29న ఎన్నికలు జరగనుండగా అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. ఆరుగురి ఎన్నికకు కావలసినన్ని ఎమ్మెల్యే సీట్లు టీఆర్ఎస్‌కి ఉండటంతో అభ్యర్థుల విజయం నల్లేరుపై నడకే అని చెప్పవచ్చు.

చదవండి : Mlc Elections: నవంబర్ 29న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

కాగా తెలంగాణ నుంచి ఆకుల లలిత, ఫరీదుద్దీన్, గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్, బీ వేంకటేశ్వర్లు, కడియం శ్రీహరి జూన్ 3వ తేదీన పదవీ విరమణ చేసారు. ఈ స్థానాలకే ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్సీ పదవులకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా కడియం శ్రీహరి, సిరికొండ మధుసూదనచారి, రవీందర్‌రావు, ఎల్‌. మరణ, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పాడి కౌశిక్‌ రెడ్డిల పేర్లను ఖరారు చేస్తూ కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు.