TRS MLC Candidates : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను టీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఎప్పటికప్పుడు ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయి.

TRS MLC Candidates : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..

Trs Mlc

TRS MLC candidates finalized : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను టీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, కౌశిక్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌కు అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఎప్పటికప్పుడు ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయి. అనూహ్యంగా ఎంపీ బండా ప్రకాశ్ పేరు చివరి నిమిషంలో వచ్చి చేరింది.

ప్రస్తుతం బండా ప్రకాశ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయకు ఇంకా రెండున్నరేళ్ల పదవీకాలం ఉంది. అయినా ఆయన్ను ఎమ్మెల్సీ బరిలో టీఆర్ఎస్ అధిష్టానం దింపుతోంది. మాజీ మంత్రి ఈటల సామాజికవర్గం కావడంతో ప్రకాశ్‌ వైపు కేసీఆర్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈటల స్థానంలో బండా ప్రకాశ్‌కు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. మాజీ స్పీకర్ మధుసూదనాచారికి రాజ్యసభ అవకాశం ఇచ్చారు.  కాగా, ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పేరు మొట్నుంచి వినిపించి.. చివరి నిమిషంలో చాన్స్ దక్కకపోవడానికి కారణాలేంటి అనేది తెలియలేదు.

Delhi Air Pollution : ఢిల్లీలో వాయుకాలుష్య నియంత్రణపై కేంద్రం అత్యవసర సమావేశం

కడియం శ్రీహరి…వరంగల్ జిల్లా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి..నల్గొండ జిల్లా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నారు. టి.రవీందర్ రావు.. వరంగల్ జిల్లా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా టికెట్ ను కన్ఫామ్ చేసుకున్నారు. పాడి కౌశిక్ రెడ్డి..కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నారు. మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి.. పెద్దపల్లి జిల్లా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నారు. బండా ప్రకాశ్.. వరంగల్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నారు.

ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి టి.రవీందర్ రావులను నిన్న ప్రకటించగా.. ఇవాళ మరో ముగ్గురు పాడి కౌశిక్ రెడ్డి, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, బండా ప్రకాశ్ లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేశారు. మొత్తం టీఆర్ఎస్ తరపున ఆరుగురు ఎమ్మెల్సీ  అభ్యర్థులను ప్రకటించారు. దీంతో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.

Delhi Air Pollution : ఢిల్లీలో వాయుకాలుష్య నియంత్రణపై కేంద్రం అత్యవసర సమావేశం

టీఆర్ఎస్ కు చెందిన ఆరుగురు అభ్యర్థులు ఇవాళ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈరోజే నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కావడంతో కచ్చితంగా  ఈ ఆరుగురు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అభ్యర్థులతో మంత్రి కేటీఆర్ అసెంబ్లీకి చేరుకోనున్నారు.