Mla RohitReddy: భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమాణం చేసి చెబుతున్నా.. రేపు ఇదే సమయానికి మళ్ళీ వస్తా..: ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సవాలు విసిరారు. ఇవాళ హైదరాబాద్, చార్మినార్ లోని భాగ్యలక్ష్మి ఆలయానికి రోహిత్ రెడ్డి వచ్చారు. భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమాణం చేసి చెబుతున్నానని, డ్రగ్స్ కేసుతో తనకు సంబంధం లేదని అన్నారు. రేపు ఇదే సమయానికి మళ్ళీ ఇక్కడికే వస్తానని, డ్రగ్స్ కేసుతో సంబంధం ఉందని బండి సంజయ్ నిరూపించాలని ఆయన సవాలు విసిరారు.

ED notices to TRS MLA Rohit Reddy
Mla RohitReddy: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సవాలు విసిరారు. ఇవాళ హైదరాబాద్, చార్మినార్ లోని భాగ్యలక్ష్మి ఆలయానికి రోహిత్ రెడ్డి వచ్చారు. భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమాణం చేసి చెబుతున్నానని, డ్రగ్స్ కేసుతో తనకు సంబంధం లేదని అన్నారు.
రేపు ఇదే సమయానికి మళ్ళీ ఇక్కడికే వస్తానని, డ్రగ్స్ కేసుతో సంబంధం ఉందని బండి సంజయ్ నిరూపించాలని ఆయన సవాలు విసిరారు. బండి సంజయ్ కు 24 గంటల సమయం ఇస్తున్నానని, నిరూపించకపోతే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. రేపు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి బండి సంజయ్ రావాలని చెప్పారు. కర్ణాటక పోలీసుల నుంచి తనకు ఎలాంటి నోటీసులూ రాలేదని, తనపై ఎలాటి కేసులు, ఎఫ్ఐఆర్ లూ నమోదు కాలేదని చెప్పారు.
రాష్ట్ర ప్రజలు బీజేపీ తీరును గమనించాలని కోరారు. ఎదిరించిన వారికి ఈడీ నోటీసులు ఇస్తూ వేధిస్తున్నారని అన్నారు. తమకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని చెప్పారు. తనకు ఈడీ ఇచ్చిన నోటీసులు చూసి న్యాయవాదులు కూడా ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. కాగా, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఈడీ నుంచి నోటీసులు అందిన విషయం తెలిసిందే. అంతకు ముందే ఆయనపై బండి సంజయ్ పలు ఆరోపణలు చేశారు.
Macherla High Tension : ఛలో మాచర్లకు టీడీపీ పిలుపు..ఎక్కడిక్కడ టీడీపీ నేతలు హౌస్ అరెస్ట్