Moto G82 5G : రేపే లాంచ్.. ముందే లీకైన మోటో G82 5G ఫోన్ ధర.. ఎంతంటే?

Motorola Moto G82 : ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్ మోటరోలా నుంచి మోటో సరికొత్త 5G ఫోన్ లాంచ్ కానుంది. లాంచ్ కాకముందే మోటో 5G ఫోన్ ధర లీకైంది.

Moto G82 5G : రేపే లాంచ్.. ముందే లీకైన మోటో G82 5G ఫోన్ ధర.. ఎంతంటే?

Moto G82 5g Price In India Leaked Ahead Of June 7 Launch

Motorola Moto G82 : ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్ మోటరోలా నుంచి మోటో సరికొత్త 5G ఫోన్ లాంచ్ కానుంది. లాంచ్ కాకముందే మోటో 5G ఫోన్ ధర లీకైంది. మోటోరోలా కంపెనీ అధికారికంగా జూన్ 7న లాంచ్ చేసేందుకు అన్ని ఏర్పాటు చేసింది. అయితే మోటో G82 5G ఫోన్ ఇండియా ధర ఆన్‌లైన్‌లో లీక్ అయింది. భారత మార్కెట్లో కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ ధర ముందుగానే లీకైంది. డిలీట్ చేసిన ఆ ఫొటోను ముందుగా మోటరోలా తమ ఇండియా ట్విట్టర్ ప్రొఫైల్‌లో పోస్ట్ చేసింది.

ఆ పోస్ట్‌ను డిలీట్ చేయడానికి ముందు ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ప్రకారం.. భారత మార్కెట్లోకి రానున్న Moto G82 ధర రూ. 25,999గా నిర్ణయించినట్టు తెలుస్తోంది. RAM, Storage వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ఈ ఫోన్ కనీసం 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుందని భావిస్తున్నాం. లీక్ అయిన ధర నిజమైతే.. Moto G82 హార్డ్‌వేర్‌కు ఎక్కువ ధరను నిర్ణయించే అవకాశం ఉంది. ఈ ఫోన్ 6.6-అంగుళాల 10-బిట్ పోలెడ్ డిస్‌ప్లేను అందిస్తుందని కంపెనీ ధృవీకరించింది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్టును కూడా కలిగి ఉంది.

Moto G82 5g Price In India Leaked Ahead Of June 7 Launch (1)

Moto G82 5g Price In India Leaked Ahead Of June 7 Launch 

అంతేకాదు.. ఈ ఫోన్ హోల్-పంచ్ డిస్‌ప్లేతో వస్తుంది. టాప్ సెంటర్‌లో కటౌట్ ఉంటుంది. వెనుకవైపు, ఫోన్ 50MP ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ప్రధాన కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతోవస్తుంది. OIS సపోర్ట్‌తో 50MP కెమెరాను అందించడంలో ఈ డివైస్ సెగ్మెంట్‌లో మొదటిదని Motorola పేర్కొంది. రూ. 25,999 ధర ఉంటే.. Realme 9pro+ 5G భారత మార్కెట్లో ఇప్పటికే రూ. 24,999కి అందుబాటులో ఉంది.

Realme నంబర్ సిరీస్ ఫోన్ OIS సపోర్టుతో వస్తోంది. 50MP Sony IMX766 ప్రైవరీ కెమెరాతో రానుంది. ఈ డివైజ్ ఇప్పటికే యూరప్‌లో లాంచ్ కాగా.. భారత మార్కెట్లో కచ్చితమైన స్పెసిఫికేషన్‌లతో వస్తుందని భావిస్తున్నారు. ఫోన్ హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ 695 SoC ప్రాసెసర్ రన్ అవుతుంది. 30W టర్బో ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీని అందిస్తుంది. Motorola కూడా భారతదేశంలో 13 5G బ్యాండ్‌లతో వస్తుందని ధృవీకరించింది. ఈ డివైజ్ గ్రే వైట్ కలర్ ఆప్షన్‌లలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది.

Read Also :  Motorola Moto G52 : OLED డిస్‌ప్లేతో మోటో G52 సిరీస్ బడ్జెట్ ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?