Movie Releases: ఛాయిస్ మీదే.. ఈ వారం థియేటర్లలోకొచ్చిన సినిమాలివే!

మరో ఫ్రైడే.. బాక్సాఫీస్ ఫైట్ కి కొత్త సినిమాలు రెడీఅయ్యాయి. ఇప్పటికే భీమ్లానాయక్ రెండో వారం కూడా స్ట్రాంగ్ రన్ చూపిస్తుంటే.. మరికొందరు హీరోలు థియేటర్స్ లో ఢీ అంటున్నారు. ఆడవాళ్లు..

Movie Releases: ఛాయిస్ మీదే.. ఈ వారం థియేటర్లలోకొచ్చిన సినిమాలివే!

Movie Releases

Movie Releases: మరో ఫ్రైడే.. బాక్సాఫీస్ ఫైట్ కి కొత్త సినిమాలు రెడీఅయ్యాయి. ఇప్పటికే భీమ్లానాయక్ రెండో వారం కూడా స్ట్రాంగ్ రన్ చూపిస్తుంటే.. మరికొందరు హీరోలు థియేటర్స్ లో ఢీ అంటున్నారు. ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీతో పాటూ మరికొన్ని సినిమాలు ఈ వారం ఆడియెన్స్ ముందుకొచ్చేశాయి.

Aadavallu Meeku Johaarlu: కలిసొచ్చిన కామెడీనే నమ్ముకున్న శర్వా.. హిట్ కొట్టేనా?

వరసగా మాస్ యాక్షన్ సీరియస్ సినిమాలు చేస్తున్న శర్వానంద్.. రూట్ మార్చి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఆడవాళ్లూ మీకు జోహార్లు సినిమాతో వచ్చాడు. రష్మిక మందాన హీరోయిన్ గా రాధిక, ఖుష్బూ, ఊర్వశి లాంటి సీనియర్ యాక్టర్లతో పెళ్లి అనే కాన్సెప్ట్ చుట్టూ తిరిగే ఇంట్రస్టింగ్ కథ తో తెరకెక్కించిన ఈ మూవీ ఈ శుక్రవారమే ధియేటర్లో రిలీజ్ అయింది. శర్వా, రష్మిక ప్రమోషన్స్ జోరు ఈ సినిమాపై ఆడయెన్స్ లో ఇంట్రెస్ట్ పెంచేసింది.

Sebastian P.C. 524 Trailer: ఓడెమ్మ.. అండర్ ది కంట్రోల్ అఫ్ సెబాస్టియన్ ఇక్కడ!

బ్యాక్ టూ బ్యాక్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్ తో ఆడియన్స్ కి దగ్గరైన కిరణ్ అబ్బవరం.. ఈసారి జానర్ మార్చి సీరియస్ సబ్జెక్ట్ తో చేసిన సినిమా సెబాస్టియన్ పిసి 524. రేచీకటి ఉన్న పోలీస్ గా ఇంట్రస్టింగ్ రోల్ ప్లే చేస్తూ ఎమోషనల్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఆడవాళ్లుతో పాటే ధియేటర్లోకొచ్చేసింది.

Jhund: వాటే ఫిలిం.. అమితాబ్ సినిమా చూసి ఏడ్చేసిన అమీర్!

అమితాబ్ బచ్చన్, ఆకాష్, రింకు రాజ్ గురు లీడ్ రోల్స్ లో తెరకెక్కిన బయోపిక్ జండ్ మార్చ్ 4నే ఫిక్స్ చేసుకుంది. స్లమ్ సాకర్ అనే ఎన్జీవోని స్టార్ట్ చేసిన విజయ్ బార్సే లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కింది జండ్. ఇప్పటికే అమితాబ్ జండ్ ప్రీమియర్ చూసి ధనుష్, ఆమీర్ లాంటి స్టార్స్ ఫిదా అయ్యారు. హాలీవుడ్ మూవీ బ్యాట్ మాన్ కూడా ఈ ఫ్రైడేపైనే కన్నేసింది. మూవీ లవర్స్ ను ట్రైలర్ తోనే ఆకట్టుకున్న బ్యాట్ మ్యాన్.. మల్టీప్లెక్సుల అడ్వాన్స్ బుకింగ్ లో రేంజ్ చూపిస్తూ థియేటర్లలోకి దిగిపోయాడు. ఇంకెందుకు ఆలస్యం ఈ వారం రిలీజైన సినిమాలలో మీ ఛాయిస్ ఏంటో డిసైడ్ చేసుకోండి.