Jhund: వాటే ఫిలిం.. అమితాబ్ సినిమా చూసి ఏడ్చేసిన అమీర్!

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. చిన్న పిల్లల సినిమా చూసిన అమీర్ చిన్న పిల్లాడిలానే ఏడుస్తూ టీషర్ట్ తో తుడుచుకుంటూ ఎమోషన్ ను ఆపుకోలేకపోయాడు.

Jhund: వాటే ఫిలిం.. అమితాబ్ సినిమా చూసి ఏడ్చేసిన అమీర్!

Jhund

Jhund: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. చిన్న పిల్లల సినిమా చూసిన అమీర్ చిన్న పిల్లాడిలానే ఏడుస్తూ టీషర్ట్ తో తుడుచుకుంటూ ఎమోషన్ ను ఆపుకోలేకపోయాడు. బాలీవుడ్ మెగాస్టార్ బిగ్‌బీ అమితాబ్‌ నటించిన తాజా చిత్రం ‘ఝండ్‌’. నాగరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత భూషణ్‌ కుమార్‌ నిర్మించారు. మురికివాడలో నివసించే పిల్లలను ఫుట్‌బాల్‌ టీమ్‌గా ఏర్పాటు చేసిన సామాజికవేత్త విజయ్‌ బార్సే జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది ఝండ్‌ సినిమా.

Bollywood Heroins: మారుతున్న రూలింగ్.. హీరోలకు పోటీ ఇస్తున్న హీరోయిన్లు

మార్చి 4న విడుదలవుతున్న ఈ సినిమా ప్రైవేట్‌ స్క్రీనింగ్‌ తాజాగా నిర్వహించగా.. దానికి స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ కూడా హాజరయ్యారు. అయితే, ఝండ్‌ సినిమా చూసిన అనంతరం ఆమిర్‌ భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. ’20 – 30 ఏళ్లుగా మనం నేర్చుకున్నదానికి ఇది బ్రేక్‌ ఇస్తుంది. వాటే ఫిలిం, మై గాడ్‌. సినిమా అత్యద్భుతంగా ఉంది. ఇండియాలోని పిల్లల ఎమోషన్స్‌ను మీరు చూపించిన విధానం చాలా బాగుంది. ఆ పిల్లలు కూడా చాలా బాగా నటించారు. నాకు మాటలు రావడం లేదు’ అని చెప్తూ కళ్ల నుంచి ఉబికి వస్తున్న నీళ్లను టీ షర్ట్‌తో తుడుచుకుంటూ స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చాడు.

Bollywood Love Affairs: మళ్ళీ పెళ్లి.. రెండోసారి పెళ్లి పీటలెక్కుతున్న సెలబ్రిటీస్!

మూవీలో నటించిన పిల్లలను మెచ్చుకున్న అమీర్.. అమితాబ్‌ కెరీర్‌లోని ఉత్తమ చిత్రాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచిపోతుందని ప్రశంసలు కురిపించాడు. అనంతరం ఝండ్‌ చిత్రయూనిట్‌ను ఆప్యాయంగా హత్తుకుని అభినందించాడు. అమీర్ కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. హ్యూమన్ యాంగిల్ లో తెరకెక్కిన ఈ సినిమా అందరినీ కదిలిస్తుందని మేకర్స్ గట్టిగా చెప్తున్నారు.