Ode To Equality : ముచ్చింతల్‌లో మహత్తర ఘట్టం..అన్ని దారులు అటువైపే

సహస్రాబ్ది ఉత్సవాల కోసం దేశం నలుమూలల నుంచీ భక్తులు తరలివస్తున్నారు. వీవీఐపీలు ఈ మహత్కార్యంలో భాగస్వాములవుతున్నారు. ఈ నెల 5న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమతామూర్తి విగ్రహావిష్కరణలో...

Ode To Equality : ముచ్చింతల్‌లో మహత్తర ఘట్టం..అన్ని దారులు అటువైపే

Samatamoorthy

Muchintal Ramanuja Charya Statue Inauguration : ముచ్చింతల్‌లో మహత్తర ఘట్టం ప్రారంభం కానుంది. అసమానతలపై అలుపెరగని పోరాటం చేసి..సమతాస్ఫూర్తిని చాటిన సమతామూర్తి శ్రీ రామానుజుల సహస్రాబ్ది వేడుకలు 2022, ఫిబ్రవరి 02వ తేదీ బుధవారం సాయంత్రం 5 గంటలకు అంకురార్పణతో ప్రారంభమవుతాయి. శ్రీరామనగరంలోని దేవాలయం నుంచి శోభాయాత్ర కన్నుల పండుగగా సాగుతోంది. భారీగా తరలివచ్చిన భక్తజనం యాత్రలో పాల్గొంటున్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి నేతృత్వంలో యాత్ర సాగుతోంది. యాగశాల దగ్గర వాస్తుశాంతి హోమం నిర్వహిస్తున్నారు. 12 రోజుల్లో ఎలాంటి అవాంతరాలు జరిగకుండా వాస్తుశాంతి హోమం జరుపుతారు.

Read More : Earthquake : ఇండోనేషియాలో అర్థరాత్రి భారీ భూకంపం.. భయాందోళనలో ప్రజలు..!

అన్ని దారులూ ఆశ్రమానికే…అన్నంతగా ముచ్చింతల్‌లో సందడి నెలకొంది. ఆశ్రమం ఆవరణలోనే కాదు… స్పూర్తి కేంద్రానికి వెళ్లే మార్గాలన్నింటిలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. యజ్ఞం కోసం ఏర్పాటు చేసిన తాటాకు పందిళ్లు, అందమైన రంగవల్లులతో ఆశ్రమ వాతావరణం ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. 12 రోజుల పాటు చినజీయర్ స్వామి పర్యవేక్షణలో క్రతువు కొనసాగుతుంది. ఉత్సవాలలో భాగంగా భారీ స్థాయిలో లక్ష్మీ నారాయణ మహాయజ్ఞం, 108 దివ్యదేశాల ప్రతిష్ట, కుంభాభిషేకం, స్వర్ణమయ రామానుజ ప్రతిష్ట, సమతామూర్తి లోకార్పణ జరుగుతాయి. అలాగే నాలుగువేదాలకు చెందిన 7 శాఖల పారాయణం, హవనం, పదికోట్ల అష్టాక్షరీ మహామంత్ర జపం, కోటి మంత్ర హవనం, పురాణ, ఇతిహాస, ఆగమ గ్రంథాల పారాయణం నిర్వహిస్తారు. హోమాల్లో 5వేలమంది రుత్విక్కులు పాల్గొంటారు. ఈ ఆధ్యాత్మిక యజ్ఞంలో పాల్గొనేందుకు, వాలంటీర్లగా విధులు నిర్వహించేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.

Read MoreStatue Of Equality : సమతాస్ఫూర్తి.. రామానుజ మూర్తి..! గురువారం జరిగే కార్యక్రమాల వివరాలు

సహస్రాబ్ది ఉత్సవాల కోసం దేశం నలుమూలల నుంచీ భక్తులు తరలివస్తున్నారు. వీవీఐపీలు ఈ మహత్కార్యంలో భాగస్వాములవుతున్నారు. ఈ నెల 5న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమతామూర్తి విగ్రహావిష్కరణలో పాల్గొంటారు. ఈ నెల 7న రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఈ నెల8న కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఈ నెల 13న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్సవాలకు హాజరుకానున్నారు. ముచ్చింతల్‌ మొత్తం పోలీసు వలయంలో ఉంది. 7 వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.