కోవిడ్ తో పానీ పూరీ వ్యాపారి మరణం..ఆదుకొనేందుకు స్థానికుల నిధుల సేకరణ

  • Published By: madhu ,Published On : June 25, 2020 / 12:51 AM IST
కోవిడ్ తో పానీ పూరీ వ్యాపారి మరణం..ఆదుకొనేందుకు స్థానికుల నిధుల సేకరణ

ఎన్నో ఏళ్ల నుంచి ఎంతో ఇష్టమైన పానీ పూరి అందించాడు..కానీ ప్రస్తుతం అతని చేస పానీ పూరీ తినలేరు. ఎందుకంటే అతను లోకంలో లేడు. దీంతో ఎంతో అభిమానించే పానీ పూరీ వ్యక్తి లేకపోవడంతో అతని కుటుంబాన్ని ఆదుకోవడానికి రంగంలోకి దిగారు స్థానికులు. నిధుల సేకరణ చేస్తున్న సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన దక్షిణ ముంబైలో చోటు చేసుకుంది. 

నేపియన్ సీ రోడ్ లో దాదాపు 46 సంవత్సరాలుగా భగవతి యాదవ్ పానీ పూరీ విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఒక నెల క్రితం కరోనా వైరస్ కారణంగా చనిపోయాడు. బిస్లెరీ పానీ పూరీ వాలాగా పేరు పొందాడు. ఇతను పానీ పూరీని తయారు చేసే సమయంలో వాటర్ బాటిల్ ను ఉపయోగిస్తుండడంతో ఆ విధంగా పేరు గడించారు.

పానీ పూరీ తయారు చేయడంలో ఎంతో జాగ్రత్త పాటిస్తాడని, కస్టమర్ల ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యం ఇస్తాడని స్థానికులు వెల్లడించారు. ఎక్స్ ట్రా పానీ పూరీ ఇవ్వడానికి వెనుకాడడని తెలిపారు. కరోనా కారణంగా చనిపోవడంతో స్థానికులు అతని కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకొచ్చారు.

కేవలం 42 రోజుల్లో రూ. 5 లక్షలు వసూలు చేయాలనే లక్ష్యంతో ముందుకు కదిలారు. కేవలం రెండు రోజుల్లో రెండు లక్షలకు పైగా నిధులు సేకరించారు. ఇందుకు ఒక వెబ్ సైట్ ను ప్రారంభించామని, ఇతనిపైనే కుటుంబం ఆధారపడి ఉందని..ఆయన కుమార్తెతో తమకు పరిచయం ఉందని నేపియన్ రోడ్ లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి వెల్లడించారు. యాదవ్ ఎంతో పరిశుభ్రంగా, కస్టమర్ల ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపడంతో స్థానికులు ఇతని వద్దకే పానీ పూరీ తినడానికి వెళ్లే వారు. 

Read: ఇస్లామాబాద్‌లో తొలి హిందూ దేవాలయానికి శంకుస్థాపన