Thaman: మ్యూజిక్ సెన్సేషన్.. స్టార్స్ సినిమాలకి ఫెస్టివల్ కిక్కిస్తున్న థమన్

యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. స్పీకర్స్ బద్దలైపోయే రేంజ్‌లో బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చి, థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేస్తున్నాడు.

Thaman: మ్యూజిక్ సెన్సేషన్.. స్టార్స్ సినిమాలకి ఫెస్టివల్ కిక్కిస్తున్న థమన్

Thaman

Thaman: యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. స్పీకర్స్ బద్దలైపోయే రేంజ్‌లో బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చి, థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేస్తున్నాడు. సినిమా సక్సెస్‌లో థమన్ మ్యూజిక్ కీ రోల్ ప్లే చేస్తుంది. తన మ్యూజిక్ తో మూవీస్ కి ఫెస్టివల్ కిక్ ఇస్తున్న థమన్ మ్యూజిక్ పై ఓ లుక్కేద్దాం.

Thaman: మహేష్‌కి పాటలు.. ప్రభాస్‌కి బీజీఎం.. హైప్ పెంచేస్తున్న థమన్

ఈ మధ్య ఏపాట విందామన్నా, ఏ స్టార్ ఆల్భమ్ చూసినా తమన్ మ్యూజిక్కే వినిపిస్తోంది. లాస్ట్ ఇయర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అఖండ.. థమన్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది మెమరబుల్ మూవీగా నిలిచిపోయింది. అరవింద సమేత, అల.. వైకుంఠపురములో తర్వాత ఆ రేంజ్ లో, భీమ్లా నాయక్ సూపర్ హిట్ తో ఈ ఇయర్ బోణీ కొట్టాడు. ఈ సినిమాకి ఊరమాస్ ట్యూన్స్ ఒడిసిపట్టి, భీమ్లానాయక్ చాట్ బస్టర్ హిట్ ఆల్బమ్ ఇచ్చాడు.

DSP-Thaman: పోటీపడుతున్న ఈ ఇద్దరూ.. మ్యూజిక్‌తో బాక్సులు బద్దలే!

సూపర్‌స్టార్ మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాకి కూడా సంగీత దర్శకుడిగా థమన్‌ని ఫిక్స్ చేసుకున్నారు త్రివిక్రమ్. రీసెంట్ గా థమన్ కంపోజిషన్ లో సర్కారు వారి పాట కళావతి సాంగ్ రిలీజ్ అయింది. 20 డేస్ లోనే 7 క్రోర్స్ వ్యూయర్షిప్ తో యూట్యూబ్ రికార్డ్స్ బద్ధలు కొట్టి, మహేశ్ ఫాన్స్ ను ఖుషి చేసింది. సర్కారు వారి పాటలో సెకండ్ సింగిల్ సాంగ్ ఈ వారంలో రిలీజ్ చేస్తామని చెప్పి సూపర్ స్టార్ ఫాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చాడు థమన్.

S.Thaman: బీజీఎం స్పెషలిస్ట్ థమన్.. స్పెషల్ ఆఫర్లు ఇస్తున్న మేకర్స్!

తెలుగు రాధేశ్యామ్ కోసం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేసిన థమన్ చేతిలో ప్రజెంట్ టాలీవుడ్ టాప్ స్టార్స్ సినిమాలున్నాయి. మెగాస్టార్ గాడ్ ఫాదర్, వరుణ్ తేజ్ గని, మెగా పవర్ స్టార్ చరణ్, శంకర్ కాంబినేషన్ సినిమా లున్నాయి. అంతే కాదు, ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో రానున్న సినిమాకు మ్యూజిక్ ఇస్తున్న థమన్, బాలకృష్ణ , గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తోన్న సినిమాకు కూడా మ్యూజిక్ చేస్తున్నాడు. ఇంకా అనగనగా ఒకరాజు, అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ థమనే. ఇలా స్టార్ హీరోల సినిమాలు చేస్తూనే, అప్ కమింగ్ హీరోల మూవీస్ కి కూడా అదే రేంజ్ లో మ్యూజిక్ ఇస్తున్నాడు థమన్.