Viral letter : నా భార్య అలిగిపుట్టింటికి పోయింది బతిమాలుకోవాలి 10 రోజులు సెలవు కావాలని కోరిన ఎస్సై..

నా భార్య అలిగిపుట్టింటికి పోయింది బతిమాలుకోవాలి 10 రోజులు సెలవు కావాలని SPకి ఓ SI రాసిన లీవ్ లెటర్ వైరల్ అవుతోంది.

Viral letter  : నా భార్య అలిగిపుట్టింటికి పోయింది బతిమాలుకోవాలి 10 రోజులు సెలవు కావాలని కోరిన ఎస్సై..

UP POlice si leave letter viral

Viral Letter : నా భార్య అలిగింది సార్..బతిమాలుకోవటానికి సెలవు కావాలని ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌లో ఓ కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు రాసిన లేఖ అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. సదరు కానిస్టేబుల్ పరిస్థితిని అర్థం చేసుకున్న ఉన్నతాధికారులు ఐదు రోజులు సెలవు మంజూరు చేశారు. ఇదిలా ఉంటే దాదాపు ఇటువంటి పరిస్థితిలోనే ఉన్న ఓ పోలీసు ఎస్సై నా భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను నచ్చ చెప్పి తిరిగి నా ఇంటికి తెచ్చుకోవాలంటే ఆమెను బతిమాలుకోవాలి..కాబట్టి నాకు 10 రోజులు సెలవు కావాలి సార్ అంటూ ఎస్పీకి లేఖ రాశాడు. ఈ లెటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Letter : నా భార్య అలిగింది సార్..బతిమాలుకోవటానికి సెలవు కావాలని కోరిన కానిస్టేబుల్.. ఐదు రోజులు సెలవిచ్చిన అధికారి

ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్ హోలీ పండుగ తన భార్యతో కలిసి జరుపుకోవటానికి ఎస్పీ అశోక్ కుమార్ మీనాకు ఇలా వినూత్నంగా లెటర్ రాశారు. పోలీసు ఉద్యోగం అంటే సెలవు దొరటం చాలా కష్టం. వారి వృత్తి అటువంటిది. ఈ క్రమంలో సదరు ఇన్‌స్పెక్టర్ భార్య గత 22 ఏళ్లుగా హోలి పండుగకు భర్తతో కలిసి పుట్టింటికి వెళ్లాలని ఆశపడింది. ఆ ఆశ 22 ఏళ్లుగా నెరవేరలేదు సదరు ఇన్‌స్పెక్టర్ కు సెలవు దొరకకపోవటంతో. దీంతో ఆమె విసిగిపోయింది. భర్తతో కలిసి హోలి పండుగకు పుట్టింటికి వెళ్లే ఆశ నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేస్తే భర్తమీద అలిగి పుట్టింటికి ఒక్కతే వెళ్లింది.

దీంతో సదరు ఇన్‌స్పెక్టర్ భార్య తనతో కలిసి హోలి పండుగ పుట్టింటిలో జరుపుకోవాలనే ఆశను నెరవేర్చలేకపోయాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కోరికను నెరవేర్చాలనుకంటున్నానని..అలాగే ఆమె అలక తీర్చటానికి ఎస్పీకి లేఖ ద్వారా తన పరిస్థితి వివరించాడు. 10 రోజులు లీవు కావాలని కోరాడు. ఈ లేఖ చదివిని ఎస్పీ అశోక్ కుమార్ మీనా తెగ నవ్వుకున్నారు. సదరు ఇన్‌స్పెక్టర్ పరిస్థితి అర్థం చేసుకుని 10రోజుల సెలవు కుదరదు గానీ 5 రోజులు తీసుకోండి అంటూ సెలవు మంజూరు చేశారు.

Read more : viral letter : ఎమ్మెల్యేగారూ..నాకొక గర్ల్‌ఫ్రెండ్‌ కావాలి..చూసిపెట్టండి సార్…

కాగా గతంలో బీహార్ లో టీచర్లు రాసిన వింత లీవ్ లెటర్స్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. వచ్చే వారంలో నా తల్లి చనిపోబోతోందని ఓ టీచర్ లీవ్ లెటర్ రాస్తే..మరో టీచర్ అంత్యక్రియల కోసం పలానా రోజుల్లో సెలవులు కావాలని ఒకరు, త్వరలోనే తన ఆరోగ్యం పాడవబోతోందని, కాబట్టి సెలవులు కావాలని మరొకరు, నేనో పెళ్లికి వెళ్లాలని..అక్కడి విందులో ఏది పడితే అది తినేస్తే కడుపు నొప్పి వస్తుంది కాబట్టి సెలవు కావాలని ఇంకొకరు ఇలా.. విద్యాశాఖాధికారులకు ఉపాధ్యాయులు రాసిన లీవ్ లెటర్లు తెగ వైరల్ అయ్యాయి.

Teachers Leave Letters viral : టీచర్ల వింత లీవ్ లెటర్లు..! మ్యాటర్ చూసిన ఉన్నతాధికులకు దిమ్మ తిరిగిపోయింది..!!

అలాగే ఓ కానిస్టేబుల్ తన గేదె ఈనిందని..ఆ గేదె పాలు తాగే నేను కానిస్టేబుల్ పరీక్షలో పాస్ అయ్యానని అటువంటి గేదె ఈనింది కాబట్టి నాకు లీవ్ కావాలి అంటూ ఉన్నతాధికారులకు రాసిన లేఖ కూడా ఇలాగే వైరల్ అయ్యింది. అలా వైరల్ అయిన లేఖల లింక్ మీకోసం..చదవండీ హాయిగా నవ్వుకోండీ..

Read more : నా ప్రియమైన గేదె ప్రసవించింది..సేవలుచేసి రుణం తీర్చుకోవాలి లీవ్ ఇవ్వండి సార్ : అధికారులకు కానిస్టేబుల్ లెటర్

Viral letter : ఇంట్లో డబ్బుల్లేకపోతే తాళం ఎందుకేశారు? కలెక్టర్ ఇంట్లో చోరీ చేసిన దొంగల లేఖ

Viral Letter : మ్యారేజ్ చేసుకుని మీరు హ్యాపీగా ఉన్నారు..నేను లవ్ ఎఫైర్‌లో ఉండే వయస్సులో కరెంట్ ఎఫైర్స్ చదువుతున్నా : తేజస్వి యాదవ్‌కు యువతి లేఖ