Mythri Movie Makers : వరుస సినిమాలు, వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్..
టాలీవుడ్ బడా సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఏడాది వరుసగా రెండు భారీ మూవీస్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకున్నారు. రెండు సినిమాలూ 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టాయి. రెండు సినిమాల్నీ ఒక్కరోజు తేడాతో రిలీజ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సంస్థ నుంచి..................

Mythri Movie Makers doing continue movies and getting hits
Mythri Movie Makers : టాలీవుడ్ బడా సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఏడాది వరుసగా రెండు భారీ మూవీస్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకున్నారు. రెండు సినిమాలూ 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టాయి. రెండు సినిమాల్నీ ఒక్కరోజు తేడాతో రిలీజ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సంస్థ నుంచి లేటెస్ట్ గా రిలీజైన మరో సినిమా అమిగోస్ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో మైత్రీ వారి పేరు మారుమోగిపోతోంది.
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న బడా నిర్మాణ సంస్థల్లో మైత్రి మూవీ మేకర్స్ ఒకటి. ‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం’ లాంటి మూడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ కొట్టి స్ట్రాంగ్ బేస్ వేసుకుంది ఈ సంస్థ. రవి శంకర్, నవీన్ ఎర్నేని ఎంతో ప్యాషనెట్ గా సినిమాలు చేస్తూ టాప్ పొజిషన్ లో దూసుకుపోతున్నారు. ఈ బ్యానర్ లో ఏ స్టార్ హీరో సినిమా చేసినా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంటూ వచ్చారు. రెండు మూడు సినిమాల్ని ఏకకాలంలో షూట్ జరపడం ఈ సంస్థ ప్రత్యేకత. ప్రతీ ఏడాది కోట్ల టర్నోవర్ తో భారీ సినిమాలు నిర్మించే మైత్రీ 2023 లో ఏకంగా రెండు సినిమాల్ని ఒకేసారి రిలీజ్ చేసి రెండూ కలిపి 350 కోట్లకు పైగానే వసూళ్ళు రాబట్టారు.
ఈ సినిమాలు రిలీజై ఒక నెల కూడా కాకుండానే మరో మీడియం సినిమాతోనూ మైత్రీ వారు మరో సక్సెస్ అందుకోవడం విశేషం. ఫిబ్రవరి 10న గ్రాండ్ గా రిలీజైన కళ్యాణ్ రామ్ సినిమా అమిగోస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ చేశాడు. ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ తో పాటు మైత్రి వాళ్ళు కూడా మంచి విజయం అందుకున్నారు. దీంతో మరోసారి మైత్రి వాళ్ళ పేరు బాగా వినిపిస్తుంది.
ఇక ఇప్పుడు తెలుగులోనే కాకుండా వేరే భాషల్లో కూడా ఆసినిమాలు మొదలుపెడుతున్నారు. ఇప్పటికే మలయాళం, హిందీలో లైన్ క్లియర్ చేసిన మైత్రి మేకర్స్ త్వరలో అన్ని భాషల్లోనూ సినిమాలు నిర్మించడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం వీళ్ళ నిర్మాణంలో ఖుషి, పుష్ప2, ఉస్తాద్ భగత్ సింగ్, యన్టీఆర్ 31, RC 16, నడిగర్ తిలకం సినిమాలు ఉండగా త్వరలో సల్మాన్ ఖాన్ తో కూడా సినిమా ప్లాన్ చేస్తుంది. ఇవే కాకుండా ఆహా ఓటీటీ కోసం సిరీస్ లు కూడా నిర్మిస్తుంది. ప్రస్తుత వరుస సినిమాలతో, వరుస సక్సెస్ లతో మైత్రి మూవీ మేకర్స్ దూసుకుపోతూ టాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉంది.