Naga Chaitanya : దటీజ్ చై.. వైరల్ అవుతున్న బ్యూటిఫుల్ పోస్ట్..

గోవాలో ఫ్యాన్స్‌తో నాగ చైతన్య సెల్ఫీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్..

Naga Chaitanya : దటీజ్ చై.. వైరల్ అవుతున్న బ్యూటిఫుల్ పోస్ట్..

Naga Chaitanya

Naga Chaitanya: యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య రియల్ లైఫ్ క్యారెక్టర్ గురించి ఫ్యామిలీ మెంబర్స్, ఇండస్ట్రీ వాళ్లు, అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు తనతో వర్క్ చేసిన స్టార్స్, డైరెక్టర్స్, ఇతర టెక్నీషియన్స్ పలు సందర్భాల్లో చెప్పడం చూశాం.. విన్నాం.. రీసెంట్‌గా చైతన్య డౌన్ టు ఎర్త్ పర్సన్ అంటూ అతని బిహేవియర్ గురించి, అభిమానుల పట్ల చై చూపించే ప్రేమ గురించిన ఓ బ్యూటిఫుల్ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Shyam Singha Roy : థియేటర్లు మూసేస్తుంటే ఏడుపొస్తోంది-ఆర్.నారాయణ మూర్తి

వివరాల్లోకి వెళ్తే.. నవీన్ శర్మ, అతని భార్య శిరీషతో కలిసి డిన్నర్ చెయ్యడానికి గోవాలో ఓ రెస్టారెంట్‌కి వెళ్లారు. వాళ్ల పక్క టేబుల్ దగ్గర ఓ గ్రూప్ కూర్చున్నారు. వాళ్లల్లో ఓ పర్సన్‌ని చూడగానే తెలుగు సినీ యాక్టర్ నాగ చైతన్యలా అనిపించింది. రాత్రిపూట, పైగా ఔట్ డోర్‌లో కూర్చోవడంతో డౌట్ వచ్చి భార్య శిరీషను అడిగారు. (ఆమె ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వ్యక్తి. నాగ చైతన్య సినిమాలన్నీ చూశారు).

Akhil Akkineni : అయ్యగారి ఐరన్ బాడీ!..

ఆమె చూసి ‘నాగ చైతన్య కాదు’ అని చెప్పారు. చైతన్య ఫ్రెండ్స్‌తో కలిసి వారి పక్క టేబుల్ దగ్గర డిన్నర్ చేస్తున్నాడు. ఓ రెండు సార్లు చూసిన తర్వాత చైతుని గుర్తుపట్టి షాక్ అయ్యారు శిరీష. ‘అవును తను చైతన్యే’ అని భర్తతో చెప్పి, సెల్ఫీ దిగాలనుకున్నారు. డిన్నర్ కంప్లీట్ అయ్యింది కానీ సెల్ఫీ అడగాలా, వద్దా? అనే దాని గురించి డిస్కషన్ జరుగుతూనే ఉంది. ఎట్టకేలకు ధైర్యం చేసి సెల్ఫీ అడిగారు.

Bigg Boss 6 Telugu : నాగార్జున సరికొత్త ప్రయోగం.. 24 గంటల పాటు లైవ్!

వెంటనే నాగ చైతన్య లేచి, వీళ్ల టేబుల్ దగ్గరకు వచ్చి, ‘ఎలా ఉన్నారు’ అని పలకరించడంతో షాక్‌తో కూడిన సర్‌ప్రైజ్‌కి గురయ్యారు. మనసులో ‘నిజంగా చై ఎంత డౌన్ టు ఎర్త్’ అనుకున్నారు. చై పక్కన ఈ కపుల్ నిలబడి సెల్ఫీ తీసుకుంటున్నారు కానీ భార్యభర్తలో ఒకరు ఫ్రేమ్‌లో కట్ అయిపోతున్నారు. ఇది గమనించిన చైతన్య ‘నేను సెల్ఫీ తీస్తాను, అప్పుడు పిక్‌లో మీరిద్దరు కనిపిస్తారు’ అని తనే సెల్ఫీ తీసాడు.

Laddunda Song : ‘లగెత్తి కొడితే లడ్డుండా.. లడ్డుండా’ – నాగ్ భలే పాడాడుగా!

ఊహించని ఈ సంఘటన గురించి నవీన్ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భారీ ఎమోషనల్ అండ్ హార్ట్ టచ్చింగ్ పోస్ట్ చేశారు. చై తో తీసుకున్న సెల్ఫీని షేర్ చేస్తూ.. ‘ఓ సూపర్ స్టార్ అయినా ఇంత డౌన్ టు ఎర్త్‌గా బిహేవ్ చెయ్యడం చూస్తే ఆశ్చర్యమేసింది.. చైతన్యతో సెల్ఫీ మెమరబుల్ మూమెంట్’ అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌ను అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Naveen Sharma (@itsnaveen.sharma)