Thank You: ధ్యాంక్యూ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్!

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘థ్యాంక్యూ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు విక్రమ్ కుమార్.....

Thank You: ధ్యాంక్యూ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్!

Naga Chaitanya Thank You Movie Trailer Release Locked

Thank You: అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘థ్యాంక్యూ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తుండటంతో మరోసారి చైతూ-విక్రమ్ కుమార్ కాంబినేషన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Thank You Movie: థాంక్ యూ.. విక్రమ్ కుమార్‌కు, చైతూ బ్రేకిస్తాడా?

ఇక పూర్తిగా ఫీల్ గుడ్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో నాగ చైతన్య మూడు విభిమన్నమైన లుక్స్‌లో ప్రేక్షకులను అలరించనున్నాడు. కాగా హీరో జీవితంలో చోటుచేసుకునే సంఘటనల వల్ల అతడు చివరికి ఎలా మారుతాడు అనేది ఈ సినిమా కాన్సెప్ట్‌గా ఉండబోతుందని ఈ చిత్ర పోస్టర్స్, టీజర్స్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో చైతూ నటన మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేలా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

Thank You Movie : మాస్కోలో మైనస్ 14 డిగ్రీస్‌లో చైతు-రాశీ ఖన్నా..

ఈ సినిమాలో అందాల భామ రాశి ఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్‌లు హీరోయిన్లుగా నటిస్తోండగా, ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను జూలై 12న సాయంత్రం 6.03 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మరి ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.