Virata Parvam: నాగాదారిలో.. వెన్నెల ప్రేమ గెలుస్తుందా లేదా?

యంగ్ హీరో రానా దగ్గుబాటి, అందాల భామ సాయి పల్లవిలు లీడ్ రోల్స్ లో నటిస్తున్న ‘విరాటపర్వం’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాను...

Virata Parvam: నాగాదారిలో.. వెన్నెల ప్రేమ గెలుస్తుందా లేదా?

Nagaadaarilo Lyrical Song From Virata Parvam Released

Virata Parvam: యంగ్ హీరో రానా దగ్గుబాటి, అందాల భామ సాయి పల్లవిలు లీడ్ రోల్స్ లో నటిస్తున్న ‘విరాటపర్వం’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కించగా, పూర్తి నక్సలిజం నేపథ్యంలో ఈ సినిమా కథను తీర్చిదిద్దారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాను తెలంగాణలో జరిగిన కొన్ని యధార్ధ ఘటనల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. అయితే ఈ సినిమాను పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చిన చిత్ర యూనిట్, ఎట్టకేలకు జూన్ 17న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది.

Virata Parvam: ఆకట్టుకుంటున్న విరాటపర్వం నగాదారిలో సాంగ్ ప్రోమో

కాగా.. తాజాగా ఈ సినిమా నుండి ‘నగాదారిలో..’ అనే లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పాటను తెలంగాణ ఫోక్ సింగర్ వరం అత్యద్భుతంగా ఆలపించడంతో ప్రేక్షకులకు ఈ పాట చాలా త్వరగా కనెక్ట్ అవుతోంది. ఇక ఈ పాటలో సాయి పల్లవి తన ప్రేమను రానాకు ఎలా చెప్పాలనే ఆరాటం మనకు ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. అడవి నేపథ్యంలోనే ఎక్కువగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీవెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

Virata Parvam: ముందుకు దూకిన విరాటపర్వం.. రిలీజ్ ఎప్పుడంటే?

ఇక ఈ సినిమాలో రానా దగ్గుబాటి, సాయి పల్లవిలతో పాటు ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, నివేథ పేతురాజ్, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో తెలియాలంటే ఈ నెల 17 వరకు వెయిట్ చేయాల్సిందే.