NBK Seva Samithi : యన్.బి.కె సేవా సమితి ఆధ్వర్యంలో కరోనా మెడికల్ కిట్స్ పంపిణీ..

‘‘మనిషికి మనిషి సాయం అందించాలి మానవత్వాన్ని బతికించాలి’ అని పిలుపునిచ్చిన మా దైవం నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్సులతో యన్.బి.కె సేవా సమితి ఆధ్వర్యంలో కరోనాతో హోమ్ ఐసోలేషన్‌లో ఉంటున్న వారికి కరోనా మెడికల్ కిట్ అందజేయబడుతుంది’’...

NBK Seva Samithi : యన్.బి.కె సేవా సమితి ఆధ్వర్యంలో కరోనా మెడికల్ కిట్స్ పంపిణీ..

Nbk

Updated On : May 29, 2021 / 12:03 PM IST

NBK Seva Samithi: తమ అభిమాన హీరో స్టైల్‌ను ఫాలో అవడం, సినిమా విడుదల రోజు హడావిడి చెయ్యడం కాదు.. తమ అభిమాన నటుడు చెప్పినట్లు సేవా కార్యక్రమాలు చేపడుతూ.. నలుగురికి సాయం చెయ్యడం అనేది అసలైన అభిమానం అంటూ.. తమ హీరో అడుగు జాడల్లో నడుస్తున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ అభిమానులు..

Balayya

ఎన్నో వ్యయ ప్రయాసలను భరిస్తూ.. అభిమాన నటుడి మాటలను పాటిస్తూ.. ఆపదలో ఉన్నవారికి సాయమందిస్తున్నారు.. బాలయ్య ఫ్యాన్స్ అనగానే KPHB Colony గుర్తొస్తుంది.. ఆ ఏరియా అభిమానులే రూటే సపరేటు.. ఇప్పుడీ కరోనా కష్ట కాలంలో బాధితులకు, హోమ్ క్వారంటైన్‌లో ఉన్నవారికి కరోనా మెడికల్ కిట్స్ అందజెయ్యాలనే మంచి కార్యక్రమానికి శ్రీ కర్నాటి కొండల రావు ఆధ్యర్వంలోని యన్.బి.కె సేవా సమితి శ్రీకారం చుట్టింది..

Balayya

‘‘ఆంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ నందమూరి తారక రామారావు గారి 98వ జయంతి సందర్భంగా ‘మనిషికి మనిషి సాయం అందించాలి మానవత్వాన్ని బతికించాలి’ అని పిలుపునిచ్చిన మా దైవం నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్సులతో యన్.బి.కె సేవా సమితి ఆధ్వర్యంలో కరోనాతో హోమ్ ఐసోలేషన్‌లో ఉంటున్న వారికి కరోనా మెడికల్ కిట్ అందజేయబడుతుంది’’…
ఇట్లు
కర్నాటి కొండల రావు
మరియు యన్.బి.కె సేవా సమితి టీమ్…
హైదరాబాద్…KPHB Colony
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ : 9494643424