Balakrishna: సీక్వెల్ మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా మారుతున్న బాలయ్య…?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వీరసింహా రెడ్డి సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ కాగా, ఈ సినిమాలో బాలయ్య రెండు వైవిధ్యమైన లుక్స్‌లో కనిపించనున్నాడు. అయితే బాలయ్య ఎప్పటినుండో ఓ సీక్వెల్ మూవీ చేస్తాడని, ఆ సినిమాతో బాలయ్య పాన్ ఇండియా స్టార్‌గా మారుతాడని ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా వినిపిస్తూ వస్తోంది.

Balakrishna: సీక్వెల్ మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా మారుతున్న బాలయ్య…?

Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వీరసింహా రెడ్డి సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ కాగా, ఈ సినిమాలో బాలయ్య రెండు వైవిధ్యమైన లుక్స్‌లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా తరువాత దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో బాలయ్య తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే అనౌన్స్ చేశాడు. అయితే బాలయ్య ఎప్పటినుండో ఓ సీక్వెల్ మూవీ చేస్తాడని, ఆ సినిమాతో బాలయ్య పాన్ ఇండియా స్టార్‌గా మారుతాడని ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా వినిపిస్తూ వస్తోంది. ఇంతకీ ఆ సీక్వెల్ మూవీ ఏమిటా అని అనుకుంటున్నారా..?

Balakrishna : అఖండ సీక్వెల్ ఉంది.. గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలకృష్ణ వ్యాఖ్యలు..

మాస్ చిత్రాల దర్శుకడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య గతేడాది ‘అఖండ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ను అందుకున్నాడు. ఈ సినిమాలో బాలయ్య రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటించగా, ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలో బాలయ్య తొలిసారి అఘోరా పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో ఈ సినిమా కలెక్షన్ల పరంగానూ బాక్సాపీస్ వద్ద అదరగొట్టింది. అయితే ఈ సినిమా విజయోత్సవ సభలో దర్శకుడు బోయపాటి అఖండ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని గతంలోనే ప్రకటించాడు.

Akhanda: అఖండ సీక్వెల్‌పై పడ్డ బోయపాటి..?

దీంతో ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా సీక్వెల్‌ను అత్యంత భారీ బడ్జెట్‌తో, భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు బోయపాటి ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తీర్చిదిద్దాలని.. ఈ సినిమాతో బాలయ్య పాన్ ఇండియా స్టార్‌గా మారుతాడని బోయపాటి ధీమా వ్యక్తం చేస్తున్నాడు. దీంతో ఈ సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తారా, మరోసారి అఖండ పాత్రలో బాలయ్యను ఎప్పుడు చూస్తామా అని నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఉన్నారు.