Nani: మార్చిలో ‘దసరా’.. ముహూర్తం పెట్టిన నాని!

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు.....

Nani: మార్చిలో ‘దసరా’.. ముహూర్తం పెట్టిన నాని!

Nani Dasara Movie First Look Glimpse Release Date Locked

Nani: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని, చాలా రోజుల తరువాత బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో తన నెక్ట్స్ చిత్రాలను పూర్తి జోష్‌తో తెరకెక్కించే పనిలో ఉన్నాడు ఈ హీరో. ప్రసుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికీ..’ అనే కామెడీ జోనర్ చిత్రంలో నటిస్తున్న నాని, ఆ తరువాత ‘దసరా’ అనే సినిమాలో నటిస్తున్నాడు.

Dasara : నాని ‘దసరా’ కోసం 12 కోట్లతో భారీ సెట్

నాని కెరీర్‌లో 29వ చిత్రంగా రాబోతున్న దసరా చిత్రంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ యువకుడిగా నేచురల్ స్టార్ కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఆయన తొలిసారి పూర్తి తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నాడు. కాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ సమయంలో ఆయన చెప్పిన డైలాగ్ అప్పట్లో ప్రేక్షకులను ఆకట్టుకోగా, దసరా సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాయి. ఇక తాజాగా దసరా చిత్ర యూనిట్ ఓ సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.

ఈ సినిమా నుండి ఓ అదిరిపోయే అప్‌డేట్ ఇస్తున్నట్లు చిత్ర యూనిట్ కొద్ది క్షణాల క్రితం ప్రకటించారు. మార్చి 20న ఉదయం 11.34 గంటలకు ఈ సినిమా నుండి సర్‌ప్రైజ్ రాబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. అయితే ‘‘ఇది ఫస్ట్‌లుక్ పోస్టరా లేక గ్లింప్సా లేక రెండు కలిపా?’’ అంటూ నాని తన అభిమానులను ప్రశ్నిస్తూ ఈ మేరకు ఓ పోస్టర్ వదిలాడు.

Dasara : ముచ్చటగా మూడోసారి..

ఇక ఈ సినిమాను పూర్తిగా క్రైమ్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదేల. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. అందాల భామ కీర్తి సురేష్ ఈ సినిమాలో నానికి జోడీగా నటించబోతుంది. మరి మార్చి 20న నాని దసరా నుండి రాబోతున్న ఆ సర్‌ప్రైజ్ ఏమిటో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.