Gang Leader : మూడు భాషల్లో నాని సినిమా రీమేక్..

ఈ సినిమాను హిందీ, తమిళ్, మలయాళం.. ఇలా మూడు భాషల్లో రీమేక్ చేస్తున్నారు డైరెక్టర్ విక్రమ్ కుమార్..

Gang Leader : మూడు భాషల్లో నాని సినిమా రీమేక్..

Gang Leader

Gang Leader: అప్పటి వరకూ పడుతూ లేస్తూ.. మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న నానితో పాటు డైరెక్టర్ విక్రమ్ కుమార్‌కి మంచి బూస్టప్ ఇచ్చింది ‘గ్యాంగ్ లీడర్’. మరి కెరీర్‌కి మైలేజ్ ఇచ్చిన ఈ సినిమాని ఏకంగా 3 భాషల్లో రీమేక్ చెయ్యడానికి డిసైడ్ అయ్యారు డైరెక్టర్ విక్రమ్.

మూవీ మేకింగ్‌లో డైరెక్టర్ విక్రమ్ స్టైలే వేరు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా కాస్త డిఫరెంట్ యాంగిల్‌లో సినిమాలు చేసే విక్రమ్.. అదే రూట్లో చేసిన సినిమా ‘గ్యాంగ్ లీడర్’. నాని హీరోగా, ‘ఆర్ఎక్స్ 100’ తో ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చుకున్న కార్తికేయ విలన్‌గా, ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్‌గా, డిఫరెంట్ ఏజ్ గ్రూప్ విమెన్‌ని మిగతా క్యారెక్టర్స్‌గా, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో చేసిన సినిమా ‘గ్యాంగ్ లీడర్’.

మెగాస్టార్ సూపర్ హిట్ మూవీ టైటిల్‌తో వచ్చిన సినిమా మీద ఫస్ట్ నుంచి ఫుల్‌గా ఎక్స్‌పెక్టేషన్స్ఉన్నాయి. వాటిని ఆ రేంజ్‌లో అందుకోలేకపోయినా మంచి టాక్ మాత్రం తెచ్చుకుంది. అందుకే ఇప్పుడు ఆ సినిమాని రీమేక్ చేద్దామని డిసైడ్ అయ్యారు. హిందీ, తమిళ్, మలయాళం.. ఇలా మూడు భాషల్లో రీమేక్ చేస్తున్నారు డైరెక్టర్ విక్రమ్ కుమార్.

నానికి సూట్ అయ్యే కథకి తన మార్క్ స్క్రీన్‌ప్లేని పెట్టి.. అద్భుతంగా తెరకెక్కించారు విక్రమ్ కుమార్. అన్ని రకాల ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యే ఈ రివేంజ్ డ్రామా.. మిగతా లాంగ్వేజెస్‌కి కూడా కనెక్ట్ అవుతుందని ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు డైరెక్టర్ విక్రమ్. ఏమాత్రం కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా లేడీస్ బ్యాచ్‌తో త్రూ అవుట్ కంప్లీట్ ఫన్ ఫిల్డ్ యాక్టింగ్ చేసిన నాని.. మరోసారి తనలోని కామెడీ టైమింగ్‌ని చూపించాడు. మరి ఇప్పుడు చెయ్యబోయే రీమేక్స్‌లో నానిగా ఎవరు కనిపించబోతున్నారో అని ఆడియెన్స్ ఎవరి గెస్‌లు వాళ్లు చేస్తున్నారు..