Nani30: తన నెక్ట్స్ మూవీ రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకున్న నాని.. ఎప్పుడంటే?

నాచురల్ స్టార్ నాని 30వ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Nani30: తన నెక్ట్స్ మూవీ రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకున్న నాని.. ఎప్పుడంటే?

Nani Locks Release Date Of Nani30

Nani30: నాచురల్ స్టార్ నాని ‘దసరా’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద తాండవం చేశాడు. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ ఊరమాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో తన రా అండ్ రస్టిక్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమా ఏకంగా వంద కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడిప్పుడే ఈ సినిమా మూడ్ నుండి బయటకొస్తున్న నాని, అప్పుడే తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టాడు.

Nani30 : Nani30 లాంచ్ ఈవెంట్ గ్యాలరీ..

ఇప్పటికే నాని నెక్ట్స్ మూవీని అఫీషియల్‌గా ప్రారంభించారు. నాని కెరీర్‌లో 30వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాను శౌర్యువ్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా రానుంది. ఈ సినిమాలో తండ్రికూతుళ్ల బంధం గురించి మనకు చూపెట్టనున్నారు. ఇక ఈ సినిమాలో నాని సరసన అందాల భామ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోండటంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ గోవాలో జరుగుతోంది. కాగా, ఈ సినిమా నుండి తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

Nani: అంటే.. మళ్లీ ఆ డైరెక్టర్‌కి ఛాన్స్ ఇచ్చిన నాని..?

నాని 30వ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. 21 డిసెంబర్ 2023 రోజున ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈమేరకు ఓ కొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాను వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు.