Nani : నాని ఖాళీగా ఉంటే ఎక్కువగా ఎక్కడ ఉంటాడో తెలుసా?

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాని తన పర్సనల్ లైఫ్ గురించి కూడా ఆసక్తికర విషయాలని వెల్లడించారు. నాని మాట్లాడుతూ.. హైదరాబాద్ నుంచి నుంచి ఒక గంట ప్రయాణం చేస్తే మా పొలం వ‌స్తుంది.

Nani : నాని ఖాళీగా ఉంటే ఎక్కువగా ఎక్కడ ఉంటాడో తెలుసా?

Nani

Nani :  సాధారణ స్థాయి నుంచి న్యాచురల్ స్టార్ గా ఎదిగిన నాని గత సంవత్సరం ఆరంభంలో కొన్ని అపజయాలు, చేదు సంఘటనలు చూసినా చివర్లో మాత్రం ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాతో థియేటర్లలో మంచి విజయాన్ని సాధించాడు. ప్రస్తుతం ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా ఇచ్చిన సక్సెస్ ని ఆస్వాదిస్తున్నాడు నాని. సినిమా రిలీజ్ ముందు ప్రమోషన్స్ ని బాగా చేశారు. ఇప్పుడు రిలీజ్ అయి సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

‘ఆర్ఆర్ఆర్’ మరోసారి వాయిదాకి కారణాలు

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాని తన పర్సనల్ లైఫ్ గురించి కూడా ఆసక్తికర విషయాలని వెల్లడించారు. నాని మాట్లాడుతూ.. హైదరాబాద్ నుంచి నుంచి ఒక గంట ప్రయాణం చేస్తే మా పొలం వ‌స్తుంది. నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. అందుకే పొలం, దాని పక్కనే ఓ చిన్న ప్లేస్ కొన్నాను. షూటింగ్ లేకపోతే, నేను ఖాళీగా ఉంటే అక్కడికే వెళ్లి గడుపుతాను. ఒక్కోసారి కుటుంబ స‌భ్యులు, స్నేహితులతో అక్కడ పొలంలో గడుపుతాను. అక్కడ ఉంటే చాలా హాయిగా ఉంటుంది. క‌రోనా స‌మ‌యంలో ఎక్కువ‌గా పొలంలోనే గ‌డిపాను” అని తెలిపాడు.