నవీన్ చంద్ర కొత్త సినిమా ప్రారంభం

నవీన్ చంద్ర కొత్త సినిమా ప్రారంభం

Naveen Chandra: ‘అందాల రాక్షసి’ తో హీరోగా పరిచయమై ‘అరవింద సమేత’, ‘భానుమతి & రామకృష్ణ’, ‘సూపర్ ఓవర్’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు నవీన్ చంద్ర నటిస్తున్న కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ఫిలింనగర్ దైవసన్నిధానంలో ప్రారంభమైంది. అరవింద్ దర్శకత్వంలో, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై జవ్వాజి రామాంజనేయులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Naveen Chandra

ప్రధాన తారగణంపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ క్లాప్ నివ్వగా, నరసింహరావు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ స్క్రిప్ట్ అందజేశారు.

Naveen Chandra

స్మృతి వెంకట్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటి మధుబాల ఓ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ సినిమాకి డైలాగ్స్: కెవి. రాజమహి

స్టంట్స్: సెల్వ

ఆర్ట్: వినోద్ రవీంద్రన్

ఎడిటింగ్: అరూల్ ఈ సిద్ధార్థ్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అంథోని ప్రశాంత్, శివ మల్లాల

మ్యూజిక్: జిబ్రాన్

కెమెరామెన్: పి.జి.ముత్తయ్య

ప్రొడ్యూసర్: రామాంజనేయులు జవ్వాజి

స్టోరీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అరవింద్ శ్రీనివాసన్