Black Fungus in Inidia : భారత్ లో 9 వేల బ్లాక్ ఫంగస్ కేసులు..ఫుల్ అయిపోతున్న హాస్పిటల్స్

Black Fungus in Inidia : భారత్ లో 9 వేల బ్లాక్ ఫంగస్ కేసులు..ఫుల్ అయిపోతున్న హాస్పిటల్స్

Balck Fungus In Indiai

Black Fungus in Inidia : భారతదేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. దాదాపు 9,000కు చేరుకున్నాయి. బ్లాక్ ఫంగస్ సోకి కొన్ని ప్రాంతాల్లో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. భారతదేశంలో 8,800కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అయ్యి దాదాపు 9వేలకు దగ్గరలో ఉన్నాయి. కరోనా సోకినవారిని బ్లాక్ ఫంగస్ వణికిస్తోంది. ఇన్పెక్షన్ సోకిన కంటిని తొలగించడం..ఆ ఫంగస్ ఉన్న ప్రాంతంలో ఆపరేషన్లు చేస్తున్నారు డాక్టర్లు. దీంతో కొంతమంది మాత్రం ప్రాణాలతో బయటపడుతున్నారు. కానీ సరైన సమయంలో చికిత్స చేయించుకోనివారు మరణిస్తున్నారు. ఇటీవల కాలంలో కరోనా బారిన పడి కోలుకున్నవారిలో బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ కనిపిస్తూ కలవరపరుస్తోంది. ఆందోళన కలిగిస్తోంది.

ఈ ఫంగస్ కరోనా బారిన పడినవారికి చికిత్సలో భాగంగా ఇచ్చిన స్టెరాయిడ్ల వల్ల సోకుతోందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారికి ఎక్కువగా ఈ ఫంగస్ ప్రమాదం ఉంటోంది. కరోనా నుంచి కోలుకున్న తరువాత 12 నుంచి 18 రోజుల్లో ఈ ఇన్ఫెక్షన్ సోకుతోందని..కొంతమందిలో 20 నుంచి 25 రోజుల తరవాత కూడా వస్తోందని తెలిపారు.

బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయి. ముఖ్యగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచే ఉన్నాయి. అలా దేశం బ్లాక్ ఫంగస్ కేసుల్లో సగం ఈ రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. దేశంలో 15 రాష్ట్రాల్లో 800 నుంచి 900 మధ్య కేసులు నమోదయ్యాయి. ఈ బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండటంతో ఇదికూడా దాదాపు కరోనా మహమ్మారిగా మారుతోంది. ఇది కూడా ఓ మహమ్మారిగా ప్రకటించమని కేంద్ర ఆరోగ్య శాఖ 29 రాష్ట్రాలను కోరింది. అంటే ఈ కేసులు ఎంతగా పెరుగుతున్నాయో ఊహించుకోవచ్చు.

కరోనా నుంచి కోలుకున్నామని సంతోషించి సంతోషంగా ఇంటికెళ్లినవారు బ్లాక్ ఫంగస్ బారిన పడి తిరిగి చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఆసుపత్రుల్లో బ్లాక్ ఫంగస్ ప్రత్యేక వార్డులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ఈ వార్డులకు కూడా అంత్యం వేగంగా ఫుల్ అయిపోతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. గత వారం ఇండోర్‌లోని 1100 పడకలు ఉన్న మహారాజా యశ్వంత్ రావు ఆసుపత్రిలో బ్లాక్ ఫంగస్ రోగులు ఎనిమిది మంది ఉండగా అదికాస్తా శనివారం (మే 26,2021) సాయంత్రానికి 185 మందికి పెరిగిపోయింది. వీరిలో 80 శాతం మందికి వెంటనే సర్జరీ చేయాల్సిన తీవ్రస్థాయిలో ఫంగస్ ఉండటం వల్ల ప్రాణాలతో బయటపడ్డారని ఓ సీనియర్ డాక్టర్ తెలిపారు.

ఈదే ఆసుపత్రిలో కేవలం బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం 11 వార్డులను ఏర్పాటు చేశామని ఆ వార్డుల్లో 200 పడకలను ఏర్పాటు చేశామని తెలిపారు.ఈ ఇన్ఫెక్షన్ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. కానీ ఈ స్థాయిలో పెరుగుతాయని అస్సలు ఊహించలేదని తెలిపారు. ఒక్క ఇండోర్‌లోనే బ్లాక్ ఫంగస్ బాధితులు 400 మంది ఉంటారని తెలిపారు. ఈ బ్లాక్ ఫంగస్ ఎక్కువగా పురుషుల్లోనే ఉంటోందని తెలుస్తోంది. కాగా మధుమేహం ఉన్నవారిలో బ్లాక్ ఫంగస్ సోకుతోందని తెలిపారు. “మ్యూకోర్‌మైకోసిస్ సోకిన రోగులందరికీ మధుమేహం నార్మల్ లో ఉండటంలేదని నిపుణులు చెబుతున్నారు.

మ్యూకోర్‌మైకోసిస్ అంటే?..అరుదుగా వచ్చే ఇన్ఫెక్షన్. ఇది సాధారణంగా మట్టిలో, మొక్కల్లో, ఎరువులో, కుళ్లిపోయిన పండ్లు, కూరగాయల్లో ఉండే మ్యూకర్ అనే ఫంగస్ వల్ల వ్యాపిస్తుంది. ఇది అక్కడ ఉంటుంది..ఇక్కడ ఉంటుందనేదేమీ ఉండదు. చాలా చోట్ల ఉంటుంది. గాలిలోను, మట్టిలోను, ఆరోగ్యకరంగా ఉండే వారి ముక్కులో కూడా ఉంటుందని చెబుతున్నారు. మ్యూకోర్‌మైకోసిస్ ఇన్ఫెక్షన్ సైనస్, మెదడు, ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారికి, అతి ముఖ్యంగా కేన్సర్, హెచ్ఐవీలాంటి వ్యాధులతో బాధపడేవారికి దీని వల్ల అంత్యం ప్రమాదం మారే అవకాశాలుంటాయని చెబుతున్నారు నిపుణులు.