Mahesh Babu: మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?

‘సర్కారు వారి పాట’ చిత్రంతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడంలో....

Mahesh Babu: మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?

New Buzz On Mahesh Babu Next Movie Goes Viral

Mahesh Babu: ‘సర్కారు వారి పాట’ చిత్రంతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఎప్పటినుండో ఊరిస్తూ వచ్చిన ఈ సినిమా పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా రావడంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా థియేటర్లకు క్యూ కట్టారు. ఇక వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇంకా బాక్సాఫీస్ వద్ద సాలిడ్‌గా రన్ అవుతుండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Mahesh Babu : రీజనల్ సినిమాతో 160 కోట్ల గ్రాస్.. 100 కోట్ల షేర్.. మహేష్ స్టామినాతో అదరగొడుతున్న ‘సర్కారు వారి పాట’

ఇక ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ చిత్ర సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న మహేష్, తన నెక్ట్స్ ప్రాజెక్టులను త్వరలోనే పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా మూవీని ప్లాన్ చేసిన మహేష్, ఈ సినిమాను స్టార్ట్ చేసేందుకు చాలా సమయం పడుతుండటంతో, ఈ గ్యాప్‌లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఓ సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి త్రివిక్రమ్ స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నాడని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

Mahesh Babu : సర్కారు వారి పాట సక్సెస్ సెలబ్రేషన్స్ ఫొటోలు

అయితే తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో రాబోయే సినిమాలో మహేష్ బాబుతో పాటు మరో స్టార్ హీరో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆ స్టార్ హీరో పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరనే డౌట్ మీకూ వస్తుందా… నేచురల్ స్టార్ నాని ఈ మూవీలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ రాసుకున్న కథలో నాని చేయబోయే పాత్ర ఆయన అభిమానులకు ఖచ్చితంగా నచ్చుతుందని ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ నుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.