Release Crash: కొత్త డేట్స్.. కొత్త క్లాషెస్.. మళ్లీ గందరగోళమేనా?

2022 అద్భుతం అనుకున్న ఫిల్మ్ ఇండస్ట్రీ.. ఇయర్ ఫస్ట్ డేనే డీలాపడింది. పాన్ ఇండియా టార్గెట్ తో బరిలో దూకుదామనుకున్న స్టార్ట్స్.. మళ్లీ బ్రేక్ వేయక తప్పేలా లేదు. కొత్త సంవత్సరానికి..

Release Crash: కొత్త డేట్స్.. కొత్త క్లాషెస్.. మళ్లీ గందరగోళమేనా?

Release Crash

Release Crash: 2022 అద్భుతం అనుకున్న ఫిల్మ్ ఇండస్ట్రీ.. ఇయర్ ఫస్ట్ డేనే డీలాపడింది. పాన్ ఇండియా టార్గెట్ తో బరిలో దూకుదామనుకున్న స్టార్ట్స్.. మళ్లీ బ్రేక్ వేయక తప్పేలా లేదు. కొత్త సంవత్సరానికి ట్రిపుల్ ఆర్ బోణీ కొట్టబోతుందనుకుంటే.. మిగిలిన మేకర్స్ కు సడెన్ షాక్ ఇచ్చింది. ఇంతకీ ఒమిక్రాన్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది.. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Radhe Shyam: ఎక్కడో ఏదో టెన్షన్.. జనవరి 14నే రాధేశ్యామ్ వస్తుందా?

పాండెమిక్ పరిస్థితులు కాస్త కుదుటపడ్డాక.. పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ వరుసగా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ ఏడాది థియేటర్స్ లో స్టార్ ప్రాజెక్ట్స్ తో పండుగ చేసుకోవాలనుకున్నారు ఫ్యాన్స్. కానీ సిచ్యుయేషన్ మళ్లీ మొదటికొచ్చేలా ఉంది. వాయిదాల పర్వం కొనసాగేలా కనిపిస్తోంది. కొవిడ్ ఆంక్షలతో రిలీజ్ డేట్స్, షూటింగ్స్ పోస్ట్ పన్ అయితే మళ్లీ గతం రిపీటవుతుంది. ఆర్ఆర్ఆర్ తో పాటూ పెద్ద సినిమాలు వాయిదాపడితే.. మిగిలిన వారినీ అవి ఇబ్బందుల్లో పడేస్తాయి.

RRR Postpone: ఆర్ఆర్ఆర్ వాయిదా వెనుక మేకర్స్ లెక్కలివేనా?

జనవరి 1 నుంచి వాయిదాపడిన ట్రిపుల్ ఆర్ ఏప్రిల్ 1కి మారొచ్చనే హింట్స్ అందుతున్నాయి. అదే జరిగితే ఆ ప్లేస్ లో ఉన్న సర్కారు వారి పాట మళ్లీ కొత్త డేట్ వెతుక్కోక తప్పదు. సర్కారు వారి పాట మాత్రమే కాదు.. ట్రిపుల్ ఆర్ ఏప్రిల్ నెలను టార్గెట్ చేస్తే నష్టం భారీగానే ఉంటుంది. ఎందుకంటే నేషనల్ ఆడియెన్స్ వెయిట్ చేస్తున్న కేజీఎఫ్ 2, లాల్ సింగ్ చద్దా లాంటి సినిమాలు ఏప్రిల్ 14న ఫిక్సయ్యాయి. అంతేకాదు ఆ నెలలో మరికొన్ని బాలీవుడ్ మూవీస్ వచ్చేందుకు రెడీఅవుతున్నాయి.

RRR: తారక్, చెర్రీ అన్నదమ్ముల బంధం.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!

రాధేశ్యామ్ సంక్రాంతికి పక్కా అన్నారు కానీ.. ఒమిక్రాన్ విజృంభిస్తే ఎవ్వరూ ఏం చేయలేరు. అదలాగే కంటిన్యూ అయి ఆంక్షలు పెరిగితే ఆ ఎఫెక్ట్ నెక్స్ రిలీజ్ లపై పడుతుంది. అంటే ఫిబ్రవరిలో ఉన్న ఆచార్య, భీమ్లా నాయక్ నుంచి ఆగస్ట్ లో ఉన్న ఆదిపురుష్, లైగర్ వరకు ఒమిక్రాన్ ఎఫెక్ట్ పడక తప్పదు. ఇలా పెద్ద మూవీ రిలీజ్ పై ఎఫెక్ట్ పడితే.. మళ్లీ కొత్త డేట్స్, కొత్త క్లాషెస్, కొత్త అనౌన్స్ మెంట్స్ తో సినిమా ఇండస్ట్రీలో మళ్లీ గందరగోళమే. ఇది టాలీవుడ్ కి మాత్రమే పరిమితం కాదు.. పాన్ ఇండియా సినిమాల పోస్ట్ పోన్ అన్ని ఇండస్ట్రీలకీ దెబ్బే.