TTD Board: టీటీడీకి కొత్త ఛైర్మన్ వస్తారా?

టీటీడీకి కొత్త ఛైర్మన్ వస్తారా? పాలక మండలి సభ్యులు మారుతారా? ప్రస్తుతం ఛైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి ఏ పదవి చేపట్టబోతున్నారు? ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం ఏలా ఉండబోతుంది? పాలక మండలికి నేటితో రెండేళ్లు పూర్తవనుండటంతో ఇప్పుడు చర్చంతా ఈ అంశాలపైనే జరుగుతోంది.

TTD Board: టీటీడీకి కొత్త ఛైర్మన్ వస్తారా?

Tirumala Tirupati Devasthanams (2)

TTD Board: టీటీడీకి కొత్త ఛైర్మన్ వస్తారా? పాలక మండలి సభ్యులు మారుతారా? ప్రస్తుతం ఛైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి ఏ పదవి చేపట్టబోతున్నారు? ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం ఏలా ఉండబోతుంది? పాలక మండలికి నేటితో రెండేళ్లు పూర్తవనుండటంతో ఇప్పుడు చర్చంతా ఈ అంశాలపైనే జరుగుతోంది.

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలికి నేటితో రెండేళ్లు పూర్తి కానున్నాయి. ప్రస్తుత పాలకమండలి 2019 జూన్‌ 22న నియమించారు. దీంతో పాలకమండలి నేటితో రెండేళ్లు నిండాయి. వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన పాలకమండలి టీటీడీ అభివృద్ధి కోసం పలు నిర్ణయాలు తీసుకుంది. సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం, వసతి సులభంగా లభించేలా అనేక మార్పులు తీసుకొచ్చారు. అయితే ప్రస్తుత పాలకమండలిని ప్రభుత్వం కొనసాగిస్తుందా? ఛైర్మన్‌, సభ్యులు మారుతారా? అన్నది ఇపుడు చర్చనీయాంశం.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే టీటీడీకి పాలకమండలిని నియమించింది. ఇందులో ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి జగన్ తన బాబాయ్ వై.వీ. సుబ్బారెడ్డిని నియమించారు. తెలుగు రాష్ట్రాలతోపాటు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన 36 మందిని పాలకమండలి సభ్యులుగా నియమించారు. ఇందులో నలుగురు ఎక్స్ అఫిషియో సభ్యులు కూడా ఉన్నారు. టీటీడీ చరిత్రలోనే పాలక మండలికి 36 మంది సభ్యులను ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి.

సాధారణంగా పాలకమండలికి ఛైర్మన్, సభ్యులను నియమించేటప్పుడు ఏడాది లేదా రెండేళ్లు కాలపరిమితితో జీవో విడుదల చేస్తారు. అయితే వై.వి. సుబ్బారెడ్డిపై ఉన్న గౌరవంతో పాలకమండలికి కాలపరిమితి లేకుండా ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని బట్టి చూస్తే రెండు సంవత్సరాలు పూర్తయినా ఇదే పాలకమండలి కొనసాగవచ్చనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం మళ్ళీ కొత్తగా జీవో విడుదల చేస్తే తప్ప పాలకమండలి మారే అవకాశం లేదు.

వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన పాలకమండలి గతంలో ఎప్పుడూ లేని ప్రతికూల పరిస్థితులను చవిచూసింది. 2020 మార్చి 20 నుంచి కరోనా కారణంగా నాలుగు నెలల కాలంపాటు శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిచిపోయాయి. గతేడాది జూన్ నెలలో దర్శనాలు ప్రారంభించినప్పటికీ పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించాల్సి వచ్చింది. భక్తుల దర్శనాలను కుదించడంతో శ్రీవారి హుండీపై ప్రభావం పడింది. ఆదాయం తగ్గడంతో ఉద్యోగుల జీతభత్యాలకు నిధులకోసం టీటీడీ ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళుతుందని అందరూ భావించారు.

అయితే అటువంటి పరిస్థితులు రాకుండానే శ్రీవారి హుండీ ఆదాయం పెరగడం టీటీడీ పాలక మండలికి ఊరటనిచ్చింది. రెండేళ్ల కాలంలో టీటీడీలో తన మార్క్ ఉండేలా అనేక నిర్ణయాలు తీసుకున్నారు సుబ్బారెడ్డి. ఇలా ఎన్నో నిర్ణయాలు, సమస్యల నుంచి గట్టెక్కుతూ వస్తోంది. అయితే ప్రస్తుత పాలక మండలి పదవీకాలం పొడిస్తారా? లేక కొత్త వారిని నియమిస్తారా? చూడాలి.