Nikhil Siddhartha : నా లైఫ్‌లో ఆ క్యారెక్టర్స్‌ని నేను ఎప్పటికి మర్చిపోలేను.. నిఖిల్!

టాలీవుడ్ యువ హీరో నిఖిల్.. తన లైఫ్‌లో గుర్తుండిపోయే పాత్రలు అవే అంటున్నాడు. ఈ యంగ్ హీరో తాజాగా నటించిన '18 పేజిస్' ఇటీవల ప్రేక్షకుల ముందకు వచ్చింది. అనుపమ పరమేశ్వరన్, నిఖిల్ రెండోసారి కలిసి నటించి విజయాన్ని అందుకోవడంతో, హీరోహీరోయిన్లు ఇద్దరు ఫుల్ ఖుషిలో ఉన్నారు. దీంతో నిన్న ట్విట్టర్‌లో ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యి..

Nikhil Siddhartha : నా లైఫ్‌లో ఆ క్యారెక్టర్స్‌ని నేను ఎప్పటికి మర్చిపోలేను.. నిఖిల్!

Nikhil says those characters are memorable

Nikhil Siddhartha : టాలీవుడ్ యువ హీరో నిఖిల్.. తన లైఫ్‌లో గుర్తుండిపోయే పాత్రలు అవే అంటున్నాడు. ఈ యంగ్ హీరో తాజాగా నటించిన ’18 పేజిస్’ ఇటీవల ప్రేక్షకుల ముందకు వచ్చింది. లవ్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కథని అందించాడు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్స్ రాబడుతుంది.

Nikhil: కార్తికేయ-2 ఎఫెక్ట్.. భారీగా పెంచేసిన నిఖిల్!

అనుపమ పరమేశ్వరన్, నిఖిల్ రెండోసారి కలిసి నటించి విజయాన్ని అందుకోవడంతో, హీరోహీరోయిన్లు ఇద్దరు ఫుల్ ఖుషిలో ఉన్నారు. దీంతో నిన్న ట్విట్టర్‌లో ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యి, తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు నిఖిల్. ఈ క్రమంలోనే ఒక నెటిజెన్.. ‘మీరు ఇప్పటివరకు చేసిన చిత్రాల్లో మీకు గుర్తుండిపోయే క్యారెక్టర్ అండ్ సినిమా అని అడిగితే, మీరు ఏది చెబుతారు’ అని అడిగాడు.

దీనికి బదులిస్తూ నిఖిల్.. “కెరీర్ మొదటిలో నేను నటించిన హ్యాపీ డేస్ మూవీలో ‘రాజేష్’ పాత్ర. అలాగే నా లైఫ్ ని మలుపు తిప్పిన కార్తికేయ మూవీలో ‘కార్తీక్’ క్యారెక్టర్ నేను ఎప్పటికి మర్చిపోలేను. ఈ రెండు నా లైఫ్‌లో ఎప్పటికి గుర్తుండిపోయే క్యారెక్టర్స్” అంటూ వెల్లడించాడు. ప్రస్తుతం ఈ హీరో ‘స్పై’ అనే మరో పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది.