Patna Blasts : మోదీ ర్యాలీలో బాంబు పేలుళ్ల కేసులో దోషులుగా 9మంది

2013 నాటి ప‌ట్నా వ‌రుస‌ బాంబు పేలుళ్ల కేసులో 10 మంది నిందితుల‌కుగాను 9 మందిని జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)ప్ర‌త్యేక కోర్టు దోషులుగా తేల్చింది. స‌రైన సాక్ష్యాధారాలు లేని

Patna Blasts : మోదీ ర్యాలీలో బాంబు పేలుళ్ల కేసులో దోషులుగా 9మంది

Patna

Patna Blasts  2013 నాటి ప‌ట్నా వ‌రుస‌ బాంబు పేలుళ్ల కేసులో 10 మంది నిందితుల‌కుగాను 9 మందిని జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)ప్ర‌త్యేక కోర్టు దోషులుగా తేల్చింది. స‌రైన సాక్ష్యాధారాలు లేని కార‌ణంగా మ‌రో నిందితుడిని నిర్దోషిగా ప్ర‌క‌టించింది. దోషులుగా తేల్చిన 9 మందికి శిక్ష ఖరారు చేయాల్సి ఉంది.

కాగా,2013లో ఎన్డీయే ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోదీని ప్రకటించిన సందర్భంగా పట్నాలోని గాంధీ మైదానంలో హుంకార్‌ పేరుతో భారీ ర్యాలీ చేపట్టారు. ర్యాలీ ప్రారంభానికి ముందే ఆ ప్రాంతం బాంబు పేలుళ్ల‌తో ద‌ద్ధ‌రిల్లింది. స‌భా ప్రాంగణంలో మొత్తం ఆరు బాంబు పేలుళ్లు సంభ‌వించ‌గా అందులో రెండు బాంబులు మోదీ ప్రసంగ వేదిక‌కు కేవ‌లం 150 మీట‌ర్ల‌ లోపు దూరంలో పేలాయి.

ఆఖ‌రి బాంబు మోదీ స‌భ వ‌ద్ద‌కు రావ‌డానికి 20 నిమిషాల ముందు పేలింది. ఆ త‌ర్వాత నాలుగు లైవ్ బాంబులు అధికారులు నిర్వీర్యం చేశారు. అయితే ఈ పేలుళ్లన్నీ మోదీ, బీజేపీ నాయకుల రాకకు ముందే జరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇక,ఈ పేలుళ్ల ఘటనలో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. 70 మంది గాయాలపాలయ్యారు.

ALSO READ AP : బాబుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్